Cyclone Montha : ‘మొంథా’ తుఫాన్‌ ఎఫెక్ట్.. ఆ ప్రాంతాల్లో రైళ్లు రద్దు.. రైల్వే స్టేషన్లలో హెల్ప్ డెస్కులు ఏర్పాటు.. నెంబర్లు ఇవే..

Cyclone Montha : ఏపీలోని కోస్తా ప్రాంత జిల్లాలకు వెళ్లే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైళ్లే అధికారులు ప్రకటించారు. మొంథా తుపాను ప్రభావంతో ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు

Cyclone Montha : ‘మొంథా’ తుఫాన్‌ ఎఫెక్ట్.. ఆ ప్రాంతాల్లో రైళ్లు రద్దు.. రైల్వే స్టేషన్లలో హెల్ప్ డెస్కులు ఏర్పాటు.. నెంబర్లు ఇవే..

Updated On : October 28, 2025 / 1:56 PM IST

Cyclone Montha : బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను ప్రభావం ఏపీ వ్యాప్తంగా కనిపిస్తోంది. మంగళవారం ఉదయం తీవ్ర తుపానుగా బలపడిన మొంథా.. ఇవాళ సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీవ్ర తుపాను తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు గరిష్ఠంగా 110 కి.మీ వేగంతో ప్రపంచ గాలులు వీస్తాయని అంచనా వేసింది. అయితే, తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైళ్వే శాఖ ప్రకటించింది.

Also Read: Cyclone Montha : తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్.. ఈ జిల్లాల్లో ఇవాళ అత్యంత భారీ వర్షాలు.. ఆ 18గంటలు జాగ్రత్త.. బయటకు రావొద్దు..

ఏపీలోని కోస్తా ప్రాంత జిల్లాలకు వెళ్లే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైళ్లే అధికారులు ప్రకటించారు. మొంథా తుపాను ప్రభావంతో ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పలు ప్రాంతాలకు వెళ్లే రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. మంగళవారం 70, బుధవారం 35.. రెండు రోజుల్లో మొత్తం 105 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, భువనేశ్వర్, విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్టణం, గుంటూరు, కాకినాడ, తెనాలి, రేపల్లె, మార్కాపురం, మచిలీపట్నం, నర్సాపురం, నిడదవోలు, ఒంగోలు, భీమవరం, మాచర్ల నుంచి బయలుదేరే పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ అధికారులు పేర్కొన్నారు. ఆరు రైళ్లను దారి మళ్లించినట్లు తెలిపారు. రద్దయిన రైళ్ల వివరాలను రైల్వే శాఖ అధికారిక వెబ్ సైట్ లో పొందుపర్చారు.

విజయవాడ అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. రైల్వే భద్రతాపరంగా అన్ని చర్యలు తీసుకునే విధంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవి ఇవాళ స‌మీక్ష‌లో సూచించార‌ని తెలిపారు. ఇప్పటివరకు 105 ట్రైన్స్ రద్దు చేశాం, 17 రైళ్ల‌ను డైవర్ట్ చేశాం. ట్రాక్ పరిస్థితి ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు పెట్రోల్ మెన్ వ్యవస్థని ముమ్మరం చేయడం జరిగింద‌ని తెలిపారు. వర్షం వలన బ్రిడ్జిస్ ఎక్కడన్నా దెబ్బ‌తిన్నట్లయితే రైలు రాకపోకలు నిలిపివేస్తాం. ప్రయాణికులకు ఆహార పానీయాలు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా I.R.T.C. వారిని యాక్టివిటీ చేశామ‌ని చెప్పారు. అదేవిధంగా ప్ర‌యాణికుల సౌకర్యార్థం హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామ‌ని చెప్పారు. ప్ర‌యాణికుల టికెట్లు క్యాన్సిలైజేషన్ కొరకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు.

విజయవాడ డివిజన్‌లోని ప్రధాన రైల్వేస్టేషన్లలో హెల్ప్‌డెస్క్‌లను రైల్వేశాఖ ఏర్పాటు చేసింది.
హెల్ప్‌ డెస్క్‌ నంబర్లు ఇవే.. 
విజయవాడ- 0866-2575167
నెల్లూరు- 9063347961
ఒంగోలు- 7815909489
బాపట్ల- 7815909329
తెనాలి- 7815909463
ఏలూరు- 7569305268
రాజమహేంద్రవరం- 8331987657
సామర్లకోట- 7382383188
తుని- 7815909479
అనకాపల్లి- 7569305669
భీమవరం- 7815909402
గుడివాడ- 7815909462