Adimulapu Suresh On Mahanadu : మహానాడు కాదు మాయనాడు, టీడీపీకి నామరూపాలు ఉండవు- మంత్రి సురేశ్

ఎన్టీఆర్ ని వందేళ్లు బతకనివ్వకుండా చంపిన చంద్రబాబుకి శతదినోత్సవ వేడుకలు చేసే అర్హత లేదన్నారు. వైసీపీ గాలి పార్టీ కాదని, దేశంలోనే బలమైన పార్టీ అని చెప్పారు.

Adimulapu Suresh On Mahanadu : మహానాడు కాదు మాయనాడు, టీడీపీకి నామరూపాలు ఉండవు- మంత్రి సురేశ్

Adimulapu Suresh On Mahanadu

Updated On : May 27, 2022 / 10:23 PM IST

Adimulapu Suresh On Mahanadu : ప్రకాశం జిల్లాలో ఒంగోలులో టీడీపీ అట్టహాసంగా నిర్వహిస్తున్న మహానాడుని అధికార పక్షం నేతలు టార్గెట్ చేశారు. మహానాడుతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అది మహానాడు కాదు మహా ప్రస్థానం అని ఒకరంటే, అది మహానాడు కాదు మాయనాడు అని మరొకరు అన్నారు. టీడీపీ నిర్వహించేది మహానాడు కాదు మాయనాడు అని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు.

TDP Mahanadu : ‘క్విట్ జగన్..సేవ్ ఏపీ’ నినాదంతో తెలుగుదేశం పార్టీ మహానాడు

ఎన్టీఆర్ ని వందేళ్లు బతకనివ్వకుండా చంపిన చంద్రబాబుకి శతదినోత్సవ వేడుకలు చేసే అర్హత లేదన్నారు. వైసీపీ గాలి పార్టీ కాదని, దేశంలోనే బలమైన పార్టీ అని చెప్పారు. వైసీపీ గాలికి టీడీపీ గత ఎన్నికల్లో కొట్టుకుపోయిందని, వచ్చే ఎన్నికల్లో నామరూపాలు లేకుండా పోతుందని మంత్రి సురేశ్ అన్నారు. అచ్చెన్నాయుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మంత్రి సురేశ్ హెచ్చరించారు.

Kodali Nani: టీడీపీకి ప్రజలు సమాధి కడతారు: కొడాలి నాని

అచ్చెన్నాయుడు అవినీతి చేశారని, అధికార దుర్వినియోగం చేశారని, అందుకే కేసులు నమోదు చేశారని వివరించారు. టీడీపీలో ఉన్నదంతా దొంగలే అని, గత ఐదేళ్లు దోచుకుతిన్నారని మంత్రి ఆరోపించారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు దొంగలు కాబట్టే ప్రజలు వాళ్లను ఇంటికి పంపించారని ధ్వజమెత్తారు. టీడీపీ కార్యకర్తలకు ఆయుధాలు ఇచ్చి విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి సురేశ్ ఆరోపణలు చేశారు.