ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేస్తే భూహక్కుదారులు భూమిని ఈజీగా అమ్ముకోవచ్చు : మంత్రి బొత్స

2019లో ఇచ్చిన మ్యానిఫెస్టో, 2024లో ప్రవేశ పెట్టిన వైసీపీ మ్యానిఫెస్టో దేశంలో ఓ కొత్త ఒరవడి తీసుకు వచ్చిందని బొత్స అన్నారు.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేస్తే భూహక్కుదారులు భూమిని ఈజీగా అమ్ముకోవచ్చు : మంత్రి బొత్స

Botsa Satyanarayana

Botsa Satyanarayana : ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ దుష్ర్పచారం చేస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఈసైన్, ఆధార్ ద్వారా రిజిస్ట్రేషన్ జరుగుతుందని చెప్పారు. వివాదాలకు తావులేకుండా యాక్ట్ ను రూపొందించినట్లు తెలిపారు. కానీ, ప్రతిపక్షాలు మాత్రం అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. మెమోలో ఉన్నది ఒకటైతే విపక్షాలు చెప్పేది మరొకటి అని మంత్రి బొత్స అన్నారు. చట్టం భూకబ్జాదారులకు వరంగా మారుతుందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. ఈ చట్టం అమల్లోకి వస్తే 99శాతం భూ వివాదాలు పరిష్కారం అవుతాయని బొత్స చెప్పారు. రాష్ట్ర ట్రైబ్యునల్ తీర్పు మీద అభ్యంతరాలు ఉంటే కోర్టుకు వెళ్లొచ్చని అన్నారు.

Also Read : వారణాసిలో మోదీపై కమెడియన్ పోటీ.. హాట్‌టాపిక్‌గా శ్యామ్ రంగీలా ప్రకటన

రాష్ట్రంలో ఉన్న భూహక్కు దారులకు లాండ్స్ హక్కుకి మరింత బలం చేకూర్చే విధంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చామని బొత్స చెప్పారు. భూ హక్కుదారుల మధ్య ఏంఆర్ఓ లాంటి వాళ్ళు లేకుండా ప్రభుత్వం అండర్ లో ఉండు విధంగా చూస్తామని అన్నారు. జీరోస్ పేపర్ భూహక్కుదారులు దగ్గర ఉంటాయని అంటున్నారు.. అవన్నీ అబద్ధపు మాటలు బొత్స క్లారిటీ ఇచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ అమలు చేస్తే భూహక్కుదారులు ల్యాండ్స్ ఈజీగా అమ్మకోవచ్చునని తెలిపారు. 2019లో ఇచ్చిన మ్యానిఫెస్టో, 2024లో ప్రవేశ పెట్టిన వైసీపీ మ్యానిఫెస్టో దేశంలో ఓ కొత్త ఒరవడి తీసుకు వచ్చిందని బొత్స అన్నారు. 2019 ఎన్నికల్లో జగన్ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టోని టీడీపీ ప్రభుత్వం కాపీ కొట్టిందని ఎద్దేవా చేశారు.

Also Read : గాజువాక పీపుల్స్ మ్యానిఫెస్టో – 2024 విడుదల చేసిన మంత్రి గుడివాడ అమర్ నాథ్.. కీలక హామీలు ఇవే..

మీ కూటమి పార్టీలే మీ హామీలను అంగీకరించలేదు. ఇంకా రాష్ట్ర ప్రజలు ఎందుకు అంగీకరించాలో చెప్పాలని, కూటమి మ్యానిఫెస్టోలో పేపర్స్ పై మోదీ ఫొటో ఎందుకు ప్రింట్ చెయ్యలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని బొత్స ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ల్యాండ్స్ ఒరిజినల్ పేపర్స్ తీసుకొని జిరా క్స్ పేపర్స్ ఇస్తామని ప్రతిపక్ష పార్టీలు దుష్ప్రచారం చేయడంపై బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.