Botsa Satyanarayana : పేదలకు మంచి విద్య అందించడం జేఎస్పీకి ఇష్టం లేదా? మంత్రి బొత్స
విదేశీ విద్యపై గ్రిప్ రావాలని టోఫెల్ విధానం తీసుకుని రావడం తప్పా అని అడిగారు. టోఫెల్ లో ఒక్కో విద్యార్థికి 7.5 రూపాయిలు మాత్రమే ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు.

Botsa Satyanarayana Serious Comments
Botsa Satyanarayana Serious Comments : జనసేనపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. టోఫెల్ విద్యా విధానంపై అనవసరంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్దేశ్యం తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు ఇష్టారాజ్యంగా మాట్లాడటం సరికాదని హితవుపలికారు. పేదవాడికి మంచి విద్య అందించడం జేఎస్పీకి ఇష్టం ఉందా లేదా అని ప్రశ్నించారు. పేద పిల్లలకు మంచి విద్య ఇస్తుంటే మీకెందుకు ఈర్ష్య అని నిలదీశారు.
విదేశీ విద్యపై గ్రిప్ రావాలని టోఫెల్ విధానం తీసుకుని రావడం తప్పా అని అడిగారు. టోఫెల్ లో ఒక్కో విద్యార్థికి 7.5 రూపాయిలు మాత్రమే ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. టోఫెల్ లో రూ.450 కోట్లు స్కాం అని నాదెండ్ల మనోహర్ అంటున్నాడని, ఇందులో స్కాం ఎక్కడ ఉందో చూపించాలని సవాల్ చేశారు. మనోహర్ పెద్ద మేధావి లా.. ఏదో పట్టుకున్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు అని ఎద్దేవా చేశారు. ప్రజలకి మంచి జరిగేదే తాము చేస్తామని పేర్కొన్నారు.
ఒకరితో చెప్పించుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. తమ ప్రభుత్వంలో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. విద్యా వవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. ప్రైవేట్ స్కూల్స్ మాదిరిగానే ప్రభుత్వ స్కూల్స్ లో విద్యను అందిస్తున్నామని పేర్కొన్నారు. పేద విద్యార్థుల కోసం బైజూస్ తెచ్చామని పేర్కొన్నారు. విద్యా వవస్థలో పెను మార్పులు తీసుకొస్తామని చెప్పారు.
https://youtu.be/xEG3J1P-fUE