సంక్రాంతి తర్వాత టీడీపీ ఖాళీ- మంత్రి దాడిశెట్టి రాజా

కాపు సామాజిక వర్గాన్ని మోసం చేసింది చంద్రబాబే అని మంత్రి రాజా ఆరోపించారు.

సంక్రాంతి తర్వాత టీడీపీ ఖాళీ- మంత్రి దాడిశెట్టి రాజా

Dadisetty Raja Slams Chandrababu Naidu (Photo : Google)

Updated On : January 10, 2024 / 10:49 PM IST

Dadisetty Raja : టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు ఏపీ రోడ్లు, భవనాల శాఖ మంత్రి, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు మంత్రి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తునిలో రా కదలిరా బహిరంగ సభలో ఖాళీ కుర్చీలు చూసి చంద్రబాబు పిచ్చెక్కి మాట్లాడినట్లు అనిపించిందన్నారు. కాపు సామాజిక వర్గాన్ని మోసం చేసింది చంద్రబాబే అని మంత్రి రాజా ఆరోపించారు.

చంద్రబాబు చేసింది ప్రతిదీ ప్రజలు గుర్తు పెట్టుకున్నారని చెప్పారు. సంక్రాంతి తర్వాత టీడీపీ ఖాళీ అవుతుందని మంత్రి రాజా జోస్యం చెప్పారు. 2014లో చంద్రబాబు దోపిడీ పరిపాలన రాష్ట్ర ప్రజలకు గుర్తుకు వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన టాయిలెట్స్ చంద్రబాబు వెనకాల ఉన్న వాళ్లు తినేశారు అని ఆరోపణలు చేశారు. 1975లో తిరుపతి బస్ స్టాండ్ లో చంద్రబాబు జేబులు కొట్టేవారని నాదెండ్ల భాస్కర్ చెప్పారని మంత్రి రాజా అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రెండు పంటలకు నీళ్లు ఎప్పుడు ఇచ్చారో చెప్పాలన్నారు. నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం తుని నుండే పోటీ చేస్తాను అని తేల్చి చెప్పారు మంత్రి దాడిశెట్టి రాజా.