Dr Seediri : విశాఖ నుండి సీఎం జగన్ పరిపాలన, ఎప్పటి నుంచో చెప్పేసిన మంత్రి

Dr Seediri On Visakhapatnam Capital : చంద్రబాబు, లోకేశ్, పవన్ అడ్రస్ లు హైదరాబాద్. అక్కడ ఉంటూ ఆంధ్ర ప్రజలకు నిర్దేశిస్తారా? మీలో ఎవరికైనా ఆధార్ కార్డు ఉందా?

Dr Seediri : విశాఖ నుండి సీఎం జగన్ పరిపాలన, ఎప్పటి నుంచో చెప్పేసిన మంత్రి

Dr Seediri On Visakhapatnam Capital (Photo : Facebook)

విశాఖ నుంచి సీఎం జగన్ పరిపాలన అతి త్వరలో ప్రారంభం కానుంది. ఇందుకోసం ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. విశాఖ నుంచి పరిపాలన ప్రారంభానికి సంబంధించి మంత్రి సీదిరి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ మొదటి వారం నుండే సీఎం జగన్ విశాఖ నుండి పాలన చేస్తారని మంత్రి అప్పలరాజు వెల్లడించారు. పరిపాలన వికేంద్రీకరణ కోసం విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించారని ఆయన వివరించారు.

50ఏళ్ల క్రితమే విశాఖను రాజధాని చేయాలనుకున్నారు..
విశాఖ రాజధాని ఉత్తరాంద్ర ప్రజల ఆకాంక్ష అని చెప్పుకొచ్చారు. 50ఏళ్ల క్రితమే విశాఖను రాజధానిగా చేయలనుకున్నారని చెప్పారు. పాదయాత్రలో ఉత్తరాంధ్ర వెనుకబాటును గుర్తించి పరిపాలన వికేంద్రీకరణ జరిగితే గానీ అభివృద్ది చెందదని భావించారని మంత్రి అన్నారు. కోర్టుల్లో ఓపక్క పోరాటం చేస్తూనే.. మరో వైపు పరిపాలన, సమీక్షలు చేయడానికి కార్యాలయాలు చూసారు అని పేర్కొన్నారు.

Also Read : నేను ఏ తప్పూ చేయలేదు,నన్ను నమ్మండి .. మత్స్యకారుల కోసమే వీడియో తీసి పోస్ట్ చేశాను : లోకల్ బాయ్ నాని

చంద్రబాబు, పవన్, లోకేశ్.. మీలో ఎవరికైనా ఆధార్ కార్డు ఉందా?
”చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ విషం చిమ్ముతున్నారు. మిలీనియం టవర్స్, రుషికొండ గెస్ట్ హౌస్ ని కబ్జా చేస్తున్నామంటున్నారు. అదేమైనా మీ బాబు ఆస్తా? అవి ప్రభుత్వ భవనాలు. ప్రభుత్వ భవనాలు వ్యక్తులకు సొంతం అవ్వవు. చంద్రబాబు, లోకేశ్, పవన్ అడ్రస్ లు హైదరాబాద్. అక్కడ ఉంటూ ఆంధ్ర ప్రజలకు నిర్దేశిస్తారా? మీలో ఎవరికైనా ఆధార్ కార్డు ఉందా?

ఉత్తరాంధ్ర టీడీపీ నేతలకు ఇంత బానిసత్వం అవసరమా? భోగాపురం, మూలపేట పోర్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విశాఖలో ఐటీ ఇండస్ట్రీ తెచ్చింది వైఎస్ఆర్. మీరు చేసిందేంటి? ఇన్ఫోసిస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీల క్యాంపస్ లు వస్తున్నాయి. సరైన కంపెనీలతో ఎంవోయూ చేసుకుంటున్నాం.

పక్క రాష్ట్రంలో ఏపీ గురించి ఎలా మాట్లాడతారు?
ఉత్తరాంధ్ర ప్రజలు ఉద్యమబాట పడతారు. వేరే రాష్ట్రంలో తిరుగుతూ.. ఆ రాష్ట్రం గురించే మాట్లాడుకో.. పవన్ కల్యాణ్. పక్క రాష్ట్రంలో.. ఏపీ ప్రతిష్ఠ దిగజార్చేలా మాట్లాడుతున్నావు. పవన్ కాన్సప్ట్ ఏంటి? తెలంగాణలో బీజేపీ. ఇక్కడ టీడీపీతో పొత్తు? ఏంటీ రాజకీయం? చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం ఇది. పవన్ నిజ జీవితంలో, రాజకీయాల్లో ఒకేలా ఉన్నారు. విలువలు లేకుండా ఉన్నారు.

Also Read : ఎంపీ రఘురామ పిటీషన్.. సీఎం జగన్, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు

సీఎంవో ఇక్కడే ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదు..
నారా లోకేశ్ పనికిమాలిన వాడు. అసలు అందులో ఎన్ని కంపెనీలు ఉన్నాయో తెలుసా? సింగిల్ విండో ద్వారా కంపెనీలకు అనుమతులు ఇస్తున్నాం. చంద్రబాబు అమరావతి రాజధాని ప్రకటించి.. హైదరాబాద్ హోటల్ లో ఉండలేదా? సీఎంవో ఇక్కడే ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదు” అని మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు.