Kodali Nani : చంద్రబాబు కాదు.. స్టేల బాబు : మంత్రి కొడాలి నాని
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. దేశంలో అత్యంత పిరికి వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు.

Kodali Nani
Minister Kodali Nani fired at Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. చంద్రబాబుపై నాని పలు ఆరోపణలు చేశారు. దేశంలో అత్యంత పిరికి వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. చంద్రబాబు కాదు.. స్టేలు బాబు అని ఎద్దేవా చేశారు. విచారణలు ఎదుర్కోలేని చంద్రబాబు..పలుకుబడితో కోర్టులో స్టేలు తెచ్చుకుంటున్నారని విమర్శించారు.
సుప్రీంకోర్టు నుంచి లక్షల్లో ఖర్చు పెట్టి పెద్ద పెద్ద లాయర్లను తెచ్చుకుంటున్నారన్నారు. పలుకుబడిని ఉపయోగించుకుని కోర్టుల్లో స్టేలు తెచ్చుకుంటున్నారని ఆరోపించారు. కేసులను ఎదుర్కొలేకే కోర్టుల్లో క్వాష్ పిటిషన్లు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు తీరును ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. శిక్ష వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. అనేకసార్లు ప్రజలు బుద్దిచెప్పారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో కూడా చంద్రబాబుకు ప్రజాశిక్ష తప్పదన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఆయన్ను ఇంటికే పరిమితం చేస్తారని చెప్పారు.