ఉత్పత్తి రంగం అభివృద్ధికి చర్యలు తీసుకున్నాం.. చాలా పెద్ద సంస్థలు ఏపీకి వస్తున్నాయి : మంత్రి నారా లోకేశ్
సింగపూర్ మోడల్, చైనా మోడల్ అని మాట్లాడుకున్నట్లే.. ఇండియా మోడల్ గురించి ప్రపంచం మాట్లాడాలి. అందులో ఆంధ్రప్రదేశ్, అమరావతి కీలక పాత్ర పోషించాలనేది ..

Nara lokesh
Minister Nara Lokesh : అమరావతిలోని విట్ యూనివర్శిటీలో ఇంటర్నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెయిర్ జరిగింది. ముఖ్యఅతిథిగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పాల్గొని ఎడ్యుకేషన్ ఫెయిర్ ప్రారంభించారు. అనంతరం లోకేశ్ మాట్లాడుతూ.. ఉన్నత విద్యకోసం నేనుకూడా విదేశాలకు వెళ్లివచ్చాను.. మనకు, విదేశాలకు ఉన్నత విద్యలో తేడాలున్నాయని అన్నారు. అక్కడ పరీక్షల సమయంలో ఇన్విజిలేటర్లు ఉండరు.. విద్యార్థులపై అలాంటి నమ్మకం ఉంటుందని పేర్కొన్నారు. మన తెలుగు వారు అంతర్జాతీయ కంపెనీల్లో అగ్రస్థానంలో ఉన్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఐటీ రంగం వృద్ధికి తీసుకున్న చర్యలతో మన పిల్లలు అద్భుతంగా రాణిస్తున్నారు.. వారంతా విదేశాల్లో ఇప్పుడు మంచి స్థానాల్లో ఉన్నారని లోకేశ్ అన్నారు. గెలవడం కోసం నిలబడాలి అన్న మాటను విద్యార్థులు గుర్తు పెట్టుకోవాలి.. అంతర్జాతీయ పరిణామాల గురించి అవగాహనతో ఉండాలని విద్యార్థులకు లోకేశ్ సూచించారు. ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్ ఎదిగేందుకు అవకాశం ఉందని అన్నారు. 1985 తరువాత మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ విజయం సాధించలేదు. 2019లో నేను కూడా పోటీ చేసి 5300 కోట్ల తేడాతో ఓడిపోయా.. కానీ, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి ప్రజల అభిమానం పొంది అత్యధిక మెజార్టీతో గెలిచా. గెలుపుకోసం నా మార్గాన్ని నేను వేసుకున్నానని లోకేశ్ అన్నారు.
Also Read: Jithendar Reddy : ‘జితేందర్ రెడ్డి’ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ పాత్ర.. వాజ్ పేయ్ పాత్ర కూడా..
ప్రపంచంలో చాలా అవకాశాలు ఉన్నాయి. యువత కూడా పెద్ద పెద్ద ఆలోచనలు చేయాలి. అమరావతి అభివృద్ధికి చాలా అవకాశాలు ఉన్నాయి. సింగపూర్ మోడల్, చైనా మోడల్ అని మాట్లాడుకున్నట్లే.. ఇండియా మోడల్ గురించి ప్రపంచం మాట్లాడాలి. అందులో ఆంధ్రప్రదేశ్, అమరావతి కీలక పాత్ర పోషించాలనేది మా లక్ష్యం అని లోకేశ్ అన్నారు. ఒక్క రాజధాని ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మా ప్రగాఢ విశ్వాసం. ఉత్పత్తి రంగాన్ని అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకున్నాం. ఫలితాలు వస్తున్నాయి. చాలా పెద్ద సంస్థలు ఏపీకి వస్తున్నాయని లోకేశ్ పేర్కొన్నారు.