Minister Roja : రెండు ఎకరాల చంద్రబాబు రెండు వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడు : మంత్రి రోజా

పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు రాజకీయ గురువు అని అన్నారు. రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకోవాలో పవన్ కళ్యాణ్ కు నేర్పుతున్న గురువు చంద్రబాబు అని విమర్శించారు.

Minister Roja : రెండు ఎకరాల చంద్రబాబు రెండు వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడు : మంత్రి రోజా

Minister Roja

Minister Roja – Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యాలు చేశారు. మాజీ మంత్రి నారాయణ రాష్ట్రాన్ని దోచుకున్నాడని.. గురువుల్లోనే ఆయన కళంకితుడు అని ఘాటుగా విమర్శించారు. చంద్రబాబు కలెక్షన్ కింగ్ అని ఎద్దేవా చేశారు. రాజధాని అమరావతి చంద్రబాబుకు బినామీ అని అన్నారు. మంగళవారం తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో జరిగిన గురుపూజోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి రోజా పాల్గొన్నారు.

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు రాజకీయ గురువు అని అన్నారు. రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకోవాలో పవన్ కళ్యాణ్ కు నేర్పుతున్న గురువు చంద్రబాబు అని విమర్శించారు. ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకుని హైదరాబాద్ లో ఇల్లు కట్టుకున్న వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు.

Anil Kumar : దుబాయ్ లో చంద్రబాబు ముడుపులు తీసుకున్నారు.. అమరావతి అనేది పెద్ద భూ దందా : అనిల్ కుమార్

వేల కోట్ల రూపాయల అక్రమార్జన చంద్రబాబు ఇంట్లో ఉందన్నారు. రెండు ఎకరాల చంద్రబాబు రెండు వేల కోట్ల రూపాయలను ఎలా సంపాదించాడు అని ప్రశ్నించారు.  రాష్ట్ర ప్రజలు కళ్ళు తెరిచారని చంద్రబాబు అబద్ధపు మాటలను నమ్మడం లేదన్నారు. త్వరలో కేసీఆర్ కూడా చంద్రబాబును తరిమికొట్టబోతున్నారని పేర్కొన్నారు.

ఈడీ, సీబీఐలు విచారణ జరిపి చంద్రబాబు, లోకేష్ లను అరెస్టు చేయాలన్నారు. ఎక్కడ తప్పు జరగకపోయినా అబద్దాలతో ప్రజలను టీడీపీ నేతలు గందరగోళానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొచ్చారని పేర్కొన్నారు.