Seediri Appalaraju : గుడ్డలిప్పి కొట్టడం అంటే అదే- పవన్ కల్యాణ్‌పై మంత్రి సీదిరి అప్పలరాజు ఫైర్
Seediri Appalaraju : పవన్ ఓ రాజకీయ వ్యభిచారి. తాగేసి మాట్లాడే పనికిమాలినోడు. నిన్ను కూడా పీకే గాడు, వీపీ గాడు అని మేము ఏకవచనంతో అనలేమా?

Seediri Appalaraju(Photo : Google)
Seediri Appalaraju – Pawan Kalyan : అధికార వైసీపీ నేతలు, జనసేనాని పవన్ కల్యాణ్ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. రెండో విడత వారాహి యాత్రలో పవన్ దూకుడు పెంచారు. సీఎం జగన్ టార్గెట్ గా చెలరేగిపోతున్నారు. ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. సీఎం జగన్ ను ఏకవచ్చనంతో సంబోధిస్తున్నారు. రీసెంట్ గా ముఖ్యమంత్రి జగన్ ని జగ్గూ భాయ్ అంటూ దుమారం రేపారు.
వైసీపీ నేతలు కూడా అదే స్థాయిలో పవన్ కల్యాణ్ పై ఎదురుదాడికి దిగుతున్నారు. పవన్ ను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా మంత్రి సీదిరి అప్పలరాజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై విరుచుకుపడ్డారు. గుడ్డలిప్పి కొట్టడం అంటే అదే పవన్ అంటూ హాట్ కామెంట్స్ చేశారాయన.
”పవన్ కల్యాణ్ ది ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ. పవన్ ఓ రాజకీయ వ్యభిచారి. తాగేసి మాట్లాడే పనికిమాలినోడు. సచివాలయాల్లో ఎలాంటి సేవలందిస్తారో పవన్ కు తెలుసా? రాజ్యాంగ వ్యవస్ధల మీద నమ్మకం లేదు. నిన్ను కూడా పీకే గాడు, వీపీ గాడు అని మేము ఏకవచనంతో అనలేమా? ప్రజలు నిన్ను రెండు చోట్ల ఓడించారే. అదే గుడ్డలిప్పి కొట్టడం అంటే. చంద్రబాబు ప్రభుత్వం హయాంలో జన్మభూమి కమిటీలు అరాచకాలు చేసినప్పడు పవన్ కల్యాణ్ ఐస్ క్రీమ్ తింటున్నారా?” అని నిప్పులు చెరిగారు మంత్రి సీదిరి అప్పలరాజు.
అటు మరో మంత్రి రోజా కూడా పవన్ పై విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్ తీరు చూస్తుంటే పిచ్చాసుపత్రి వచ్చినట్లు ఉందన్నారు. పవన్ ప్యాకేజీ కోసమే పని చేస్తున్నారని ఆరోపించారు. పవన్ కు ఫ్యాన్స్ ఉంటే, వైసీపీకి సోల్జర్స్ ఉన్నారని మంత్రి రోజా చెప్పారు. వార్డు మెంబర్ గా కూడా గెలవలేని పవన్ కల్యాణ్.. జగన్ సైన్యం మాట్లాడతారా? అని మండిపడ్డారు. ఇది షూటింగ్ కాదు రియాలిటీ అనే విషయం పవన్ తెలుసుకోవాలని మంత్రి రోజా అన్నారు.