Minister Vidadala Rajini: రేపల్లె ఘటనలో నిందితులను కఠినంగా శిక్షిస్తాం: మంత్రి విడదల రజిని
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజనీ పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వం తరుపున రూ.2 లక్షలు చెక్కును అందించారు

Vidadala
Minister Vidadala Rajini: రేపల్లె రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి ఒక మహిళపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని మెరుగైన చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజనీ పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వం తరుపున రూ.2 లక్షలు చెక్కును అందించారు. అనంతరం ఆసుపత్రి వెలుపల మంత్రి విడదల రజిని మీడియాతో మాట్లాడుతూ రేపల్లే రైల్వే ఘటన అత్యంత భాదకరమని అన్నారు. ఒక మహిళగా తల్లిగా చాలా బాదవేసిందని మంత్రి రజిని అన్నారు. పొట్టకూటి కోసం వెల్లిన ఒక మహిళపై దుర్మార్గులు ఇలా అత్యాచారానికి పాల్పడడం హేయమైన చర్యగా మంత్రి పేర్కొన్నారు.
Also read:Chandrababu: ఆడబిడ్డల ప్రశ్నలకు జగన్ ప్రభుత్వం ఏమి సమాధానం చెపుతుంది?: మాజీ సీఎం చంద్రబాబు ట్వీట్
ఘటనపై పూర్తి సమాచారం తెప్పించుకున్న సీఎం జగన్..ఘటనను సీరియస్ గా తీసుకోవాలని పోలీసులకు ఆదేశించినట్లు మంత్రి విడదల రజిని తెలిపారు. భాదితురాలికి మెరుగైన వైద్యం అందించాలని రిమ్స్ సూపరింటెండెంట్ కి సూచించారు. ఈఘటనలో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారని..నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని మంత్రి తెలిపారు. ప్రభుత్వం భాదితుల కుటుంభానికి అండగా ఉంటామనే భరోసా నిచ్చేందుకు బాదితురాలికి 2 లక్షల చెక్కును అందించినట్లు మంత్రి రజిని పేర్కొన్నారు. ఘటనపై మీడియా కూడా బాదితురాలి విషయంలో మానవత్వంతో వ్యవహరించి, బాదితురాలి పై ప్రభావం పడకుండా చూడాలని మంత్రి విడదల రజిని సూచించారు.
Also read:Woman Gang Rape : రేపల్లే రైల్వే స్టేషన్ లో మహిళపై గ్యాంగ్ రేప్..భర్తను బెదిరించి అఘాయిత్యం