AP SCC Evaluation: పదో తరగతి జవాబుపత్రాల వాల్యూయేషన్‌లో తప్పులు.. ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం
రీవాల్యూయేషన్ కోసం 64 వేల 251, రీవెరిఫికేషన్ కోసం 2వేల 112 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపింది.

ఏపీలో పదో తరగతి జవాబు పత్రాల వాల్యూయేషన్ లో లోటుపాట్లపై కీలక నిర్ణయం తీసుకుంది విద్యాశాఖ. జవాబు పత్రాల మూల్యాంకనంలో తప్పులు దొర్లినట్లు గుర్తించింది. దీంతో ఐదుగురు ఎవాల్యూయేటర్లపై వేటు వేసింది. ఐదుగురిని సస్పెండ్ చేసింది. మార్కులు వేసే సమయంలో తప్పులు ఎక్కువగా దొర్లినట్లు విద్యాశాఖ గుర్తించింది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలను జూన్ 1 ఫైనల్ చేస్తామని ప్రకటించింది.
Also Read: వైసీపీకి జూన్ టెన్షన్.. కీలక నేతల అరెస్టులు ఉంటాయనే ప్రచారంతో పరేషాన్..
రీవాల్యూయేషన్ కోసం 64 వేల 251, రీవెరిఫికేషన్ కోసం 2వేల 112 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపింది. మరోవైపు ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు చివరి తేదీ ముగియడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. దీంతో జూన్ 5 నుంచి 10 వరకు ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు గడువు పొడిగించాలని రిక్వెస్ట్ చేసింది విద్యాశాఖ.