Vijayawada: కృష్ణా జిల్లాలో రియల్ మోసం.. రూ.6 కోట్ల స్వాహా

Vijayawada: కృష్ణా జిల్లాలో రియల్ మోసం.. రూ.6 కోట్ల స్వాహా

Vijayawada

Updated On : June 12, 2021 / 6:16 PM IST

Vijayawada: ఎమ్‌కే రియల్‌ డెవలపర్స్‌ సంస్థ బోర్డు తిప్పేసింది. వెంచర్ల పేర రూ.6 కోట్లు వసూలు చేసిన సంస్థ నిర్వాహకులు కష్టమర్లను మోసం చేశారు. రాజమండ్రికి చెందిన పట్నాల శ్రీనివాసరావు 2020 ఆగస్టులో విజయవాడలోని గురునానక్‌ కాలనీలో ఎమ్‌కే రియల్‌ డెవలపర్స్‌ ఆఫీస్‌ను తెరిచాడు. కంపెనీ ఛైర్మన్‌గా ఉప్పు మనోజ్‌కుమార్‌, డైరెక్టర్‌గా బలగం రవితేజ ఉన్నారు. నిర్మాణం, ప్లాట్ల అమ్మకం పేరుతో డబ్బులు వసూలు చేశారు. డబ్బు ఇచ్చిన వారు గత కొద్దీ రోజులుగా సంస్థ నిర్వాహకులకు ఫోన్ చేస్తున్నారు. అయితే వారు స్పందించకపోవడంతో మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిర్వాహకుల కోసం గాలింపు చేపట్టారు. ఇక ఎమ్‌కే సంస్థ కారణంగా విజయవాడ, గుంటూరు, కడప, శ్రీశైలం, విశాఖకు చెందిన పలువురు మోసపోయినట్లు సమాచారం.