Kodali Nani : గుడివాడ నీటి సమస్య పరిష్కారానికి ఎకరా భూమి కొన్నట్లు చెప్పినా.. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా : కొడాలి నాని

చంద్రబాబు ఖాళీ ఖజానా ఇచ్చిపోతే జగన్ రూ.4 నుంచి 5 లక్షల ఖర్చు చేసి పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారని వెల్లడించారు.

Kodali Nani : గుడివాడ నీటి సమస్య పరిష్కారానికి ఎకరా భూమి కొన్నట్లు చెప్పినా.. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా : కొడాలి నాని

nani

Updated On : June 16, 2023 / 1:34 PM IST

Kodali Nani criticized Chandrababu :  చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శలు చేశారు. 2007లో నాటి సీఎం వైఎస్ఆర్ ను తాను ప్రతిపక్ష ఎమ్యెల్యేనైనా ఇళ్ల స్థలాలు ఇవ్వమని అడిగితే 77 ఎకరాలు మంజూరు చేశారని ఎమ్యెల్యే కొడాలి నాని తెలిపారు. వైఎస్ఆర్ కుమారుడు జగన్ రూ.800 కోట్లతో ఇళ్లు నిర్మించారని పేర్కొన్నారు. చంద్రబాబు 3400 టిడ్కో ఇళ్లు మంజూరు చేసి 1200 ఇళ్లు ప్రారంభించారని వెల్లడించారు. రూపాయికే 300 చదరపు అడుగుల ఈ ఇళ్లను జగన్ ఇచ్చారని పేర్కొన్నారు.

రాజశేఖర్ రెడ్డి కొన్న స్థలంలో దొంగ 420 చంద్రబాబు నాయుడు ఇళ్లు నిర్మించానంటాడు అని విమర్శించారు. ఆయన అత్తగారి ఇళ్లు ఉందని, బందువులు ఉన్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గుడివాడను గాలికి వదలివేశాడని విమర్శించారు. జగన్ రెండు రైల్వే గేట్లకు రూ.300 కోట్లతో ప్లైఓవర్ నిర్మిస్తున్నాడని తెలిపారు. గుడివాడ దాహార్తి తీర్చిన మహానుభావుడు వైఎస్ఆర్ అని కొనియాడారు.

Dr Gaurav Gandhi : 16,000 గుండె ఆపరేషన్లు చేసిన కార్డియాలజిస్ట్ 41 ఏళ్లకే గుండెపోటుతో మృతి

చంద్రబాబు ఖాళీ ఖజానా ఇచ్చిపోతే జగన్ రూ.4 నుంచి 5 లక్షల ఖర్చు చేసి పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారని వెల్లడించారు. చంద్రబాబు నాయుడు గుడివాడ నియోజకర్గానికి ఒక్క ఎకరా భూమి కొనుగోలు చేసినా, నీటి సమస్య పరిష్కారానికి ఎకరా భూమి కొన్నట్లు చెప్పినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు. దమ్ముంటే గుడివాడకు వచ్చి పోటీ చేయాలని నాని చంద్రబాబుకు సవాల్ చేశారు.

గుడివాడకు తానే ఎమ్మెల్యేనని.. జగన్ దయతో గుడివాడకు ఎమ్యెల్యేగా ఉంటానని తెలిపారు. శాసన సభ్యునిగా అసెంబ్లీలో అడుగుపెడతాను దమ్నుంటే అడ్డుకో జగన్ అని పవన్ అంటున్నాడని పేర్కొన్నారు. శాసన సభ్యుడిగా అసెంబ్లీలోకి అడుగుపెడతానని పవన్ కళ్యాణ్ అన్నాడని తెలిపారు. పార్టీ పెట్టింది ఎమ్యెల్యే కావడానికా? ముఖ్యమంత్రి కావడానికి కాదా? అని పవన్ ను నాని ప్రశ్నించారు.

Ambati Rambabu : పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరో.. రాజకీయాల్లో కమెడియన్ : మంత్రి అంబటి

హీరోయిన్ లు నవనీత్ కౌర్, సుమలతలు ఎంపీలుగా ఎన్నికయ్యారని పేర్కొన్నారు. పవర్ స్టార్, మెగా పవర్ స్టార్.. ఆకాశంలో ఎన్ని స్టార్ లు ఉంటే అన్నీ ఆయనేనని పవన్ అంటాడని ఎద్దేవా చేశారు. అన్ని పార్టీలను కలుపుకుని చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తానని పవన్ అంటాడని నాని వెల్లడించారు.