రాజధాని చిచ్చు : బాబు దమ్ము, ధైర్యం ఉందా..రోడ్డుపైకి రా – పిన్నెల్లి

బాబు..దమ్ము..ధైర్యం ఉందా ? ఉంటే రోడ్డుపైకి రా…తాము టచ్ చేయాలని అనుకుంటే..లింగమనేని గెస్ట్ హౌస్‌లో ఒక్క గంట సేపు కూడా ఉండవు..రైతుల ముసుగులో విష ప్రచారం చేస్తున్నారు.. బాబు, లోకేష్ స్క్రిప్ట్ ప్రకారం కళా వెంకట్ రావు, ఇతర నేతలు మాట్లాడుతున్నారు.. బాబు ట్రాప్‌లో పడొద్దు..ఆయన నట్టేట ముంచుతాడు..అంటూ రాజధాని రైతులకు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సూచించారు. 2020, జనవరి 07వ తేదీన చినకాకాని వద్ద హైవే దిగ్భందం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాహనంపై దాడి జరిగింది. ఈ ఘటనలో 15 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ సందర్భంగా 10tv పిన్నెల్లితో ముచ్చటించింది. ఈ సందర్భంగా దాడికి సంబంధించినవి, ఇతర విషయాలు మాట్లాడారు.
వైసీపీ పార్టీలో తాను సీనియర్ నాయకుడిగా ఉన్నానని, తాను పర్యటిస్తే..తప్పుడు ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. తాను విజయవాడకు వెళుతున్నట్లు, డిస్ట్రర్బ్ చేయాలని అనుకుంటే..తాను ఒక్కడినే ఎందుకు వెళుతానని ప్రశ్నించారు. దాడి చేసిన దానిని కప్పిపుచ్చుకోవడానికి ఏవేవో మాట్లాడుతున్నారని, ఎద్దేవా చేశారు. తన కారు ముందుకు వెళ్లకుండా..మరో వాహనం అడ్డుగా పెట్టారని, అనంతరం వెనుకనుంచి దాడికి పాల్పడ్డారని తెలిపారు.
తాను ఒక వేళ కారు దిగితే..దాడికి ప్రయత్నించారని మరో ప్రచారం చేస్తారని, అందుకే తాను సౌమ్యంగా వారికి సమాధానం చెప్పడం జరిగిందన్నారు. శాంతియుతంగా ధర్నాలు చేస్తుంటే..రాళ్లు, కర్రలు ఎందుకు ఉంటాయని ప్రశ్నించారు. ఘటనకు సంబంధించిన దానిపై ఎవరెవరు ఉన్నారో పోలీసులు విచారిస్తున్నారని, వారిని అరెస్టు చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఏ సంక్షేమ కార్యక్రమాన్ని చేస్తున్నా..దానికి ఒక రోజు ముందు..డిస్టర్బ్ చేసేందుకు బాబు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
పల్నాటు గడ్డపై, రక్తంతో ఉన్నామన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినట్లు గుర్తు చేశారు. తాను గతంలో తన నియోజకవర్గంలో వైసీపీ పార్టీ తరపున తాను పోరాటం చేయడం జరిగిందన్నారు. ఏదో రకంగా తనను భయపెట్టాలని ఆనాటి నుంచే ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. తనను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసినా విఫలమౌతాయని ఆనాడే బాబుకు చెప్పడం జరిగిందన్నారు.
జగన్ దారిలో తాము నడుస్తున్నట్లు, ప్రజల కోసం ఎంతకైనా ముందుకెళుతామని చెప్పినట్లు వివరించారు. రాజధాని రైతులకు అండగా తాము ఉంటామని మరోసారి భరోసా ఇచ్చారు. రైతులను ఆదుకోవడానికి, మద్దతు ధర కోసం కోట్ల రూపాయలు నిధులు కేటాయించినట్లు తెలిపారు. సీఎం అయిన అనంతరం జగన్…చెప్పిన మాటలు ఒక్కోక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్న సంగతిని వివరించారు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.
Read More : బుట్టబొమ్మ సాంగ్ ప్రోమో..అల్లు అర్జున్ స్టెప్స్ అదుర్స్