పవన్ కళ్యాణ్‌కు పార్టీ అవసరమా? తిరుపతి ఎంపీ బైపోల్స్‌లో గెలుపు వైసీపీదే

roja pawan kalyan: తిరుపతిలో జనసేన ఉనికి లేదని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. పార్టీ పెట్టిన నాయకులెవరైనా పార్టీ సిద్ధాంతాల కోసం పని చేస్తారు, ఎన్నికల్లో పోటీ చేస్తారు.. కానీ జనసేన మాత్రం ఇతర పార్టీల సిద్ధాంతాల కోసం పని చేస్తోందని, అసలు ఎన్నికల్లో పోటీ చేయదని విమర్శించారు. ఇతర పార్టీలకు ఓటు వేయాలని అభ్యర్థించే పవన్ కల్యాణ్‌కు పార్టీ అవసరమా అని రోజా ప్రశ్నించారు.
గెలుపు వైసీపీదే:
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో వైసీపీనే గెలుస్తుందని ఎమ్మెల్యే రోజా ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో బీజేపీకి ఒక్క సీటు వచ్చిన దాఖలాలు లేవన్నారు. ఎన్నికలు జరిగినా బీజేపీ గెలవదన్నారు. గ్రేటర్ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నందుకు తిరుపతి సీటు కావాలని అడిగేందుకు పవన్ ఢిల్లీ వెళ్లారని రోజా అన్నారు.
https://10tv.in/cm-jagan-serious-on-svbc-link/
పవన్ కు అంత సీన్ లేదు:
పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన కాదు భజనసేన అని రోజా ఎద్దేవా చేశారు. పార్టీ పెట్టినప్పుడే జనసేన పోటీ చేయలేకపోయింది, పోటీ చేసిన సొంత ఊళ్లోనే పవన్ ఓడిపోయారు, ఇక తిరుపతిలో పవన్ గెలిచే సీన్ ఉందా అని రోజా అడిగారు. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో బీజేపీ పోటీ చేయడం కూడా అత్యాశే అవుతుందన్నారు రోజా. టీడీపీ బరిలోకి దిగినా అసలు పోటీనే కాదన్నారు రోజా. తిరుపతి ఎంపీ బైపోల్స్ లో గెలిచేది వైసీపీనే అని రోజా తేల్చి చెప్పారు.