MLC Mohammad Rahutullah : బైక్ ను ఢీకొట్టిన ఎమ్మెల్సీ మహ్మద్ రహుతుల్లా కారు.. ఒకరు మృతి
అయితే, ఎమ్మెల్సీ డ్రైవర్, అనుచరులు కారును వదిలి పరారయ్యారు. ప్రమాదం జరగ్గానే కారు అద్దానికి ఉన్న ఎమ్మెల్సీ స్టిక్కర్ ను అనుచరులు తొలగించారు.

Road Accident
Car Collided Bike : విజయవాడలో ఎమ్మెల్సీ మహ్మద్ రహుతుల్లా కారు బీభత్సం సృష్టించింది. బీఆర్టీఎస్ రోడ్ లో అర్ధరాత్రి 2:30 గంటలకు ఎమ్మెల్సీ కారు బైక్ ను ఢీకొట్టింది. దీంతో ఒకరు మృతి చెందగా, మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.
అయితే, ఎమ్మెల్సీ డ్రైవర్, అనుచరులు కారును వదిలి పరారయ్యారు. ప్రమాదం జరగ్గానే కారు అద్దానికి ఉన్న ఎమ్మెల్సీ స్టిక్కర్ ను అనుచరులు తొలగించారు. కార్ సెన్సార్ బ్లాక్ అవడంతో కారు వదిలి పరార్ అయ్యారు.
Karnataka Road Accident: దైవ దర్శనానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ఐదుగురు ఏపీ వాసులు మృతి
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కారును గుణదల స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.