Andhra Pradesh : కర్నూలులో జంట హత్యల కలకలం .. భవనం పైఅంతస్తులో తల్లి, కింద కూతురు హత్య
కర్నూలులో మరో దారుణ ఘటనలు చోటుచేసుకున్నాయి. నగరంలోని చెన్నమ్మ సర్కిల్ వద్ద డబుల్ మర్డర్లు తీవ్ర కలకలం రేపాయి. తల్లీ కూతురిని దుండగులు నరికి చంపిన ఘటన కర్నూలు నగరంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. చెన్నమ్మ సర్కిల్ వద్ద ఉన్న ఓ భవనంపై అంతస్తులో తల్లిని..కింద అంతస్తులోని ఓ గదిలో కూతురిని హత్య చేశారు.

Mother and daughter murdered at Chennamma Circle, Kurnool
Andhra Pradesh : కర్నూలులో మరో దారుణ ఘటనలు చోటుచేసుకున్నాయి. నగరంలోని చెన్నమ్మ సర్కిల్ వద్ద డబుల్ మర్డర్లు తీవ్ర కలకలం రేపాయి. తల్లీ కూతురిని దుండగులు నరికి చంపిన ఘటన కర్నూలు నగరంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. చెన్నమ్మ సర్కిల్ వద్ద ఉన్న ఓ భవనంపై అంతస్తులో తల్లిని..కింద అంతస్తులోని ఓ గదిలో కూతురిని హత్య చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ఈ జంట హత్యలకు కారణాలను తెలుసుకుంటున్నారు. మృతులను రుక్మిణీదేవి, రమాదేవిగా పోలీసులు గుర్తించారు. కాగా ఈ హత్యల ఘటనలో ఇంటి యజమానికి కూడా గాయాలు కాగా ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.
ఈ జంట హత్యలకు కారణం, కుటుంబ కలహాలా? లేదా పాతకక్షలా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గురి అయిన రుక్మిదేవికి వారం రోజుల క్రితమే వివాహం జరిగిందని పోలీసులు గుర్తించారు. కాగా..కేవలం వారం రోజుల క్రితమే వివాహం అయిన రుక్మిణిని, ఆమె తల్లిని హత్య చేయాల్సిన అసవరం ఎవరికి ఉంది? రుక్మిణి అత్తింటివారికి ఈ హత్యల్లో ప్రమేయం ఉందా? లేదా కుటుంబ కలహాలా? పాతకక్షలు ఏమైనా ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ డబుల్ మర్డర్లతో చెన్నమ్మ సర్కిల్ ప్రాంతంలో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు.