మద్యం దొరక్కపోవడంతో శానిటైజర్ తాగి తల్లీకొడుకు మృతి

  • Published By: srihari ,Published On : June 1, 2020 / 12:56 PM IST
మద్యం దొరక్కపోవడంతో శానిటైజర్ తాగి తల్లీకొడుకు మృతి

Updated On : June 1, 2020 / 12:56 PM IST

కడప జిల్లాలో శానిటైజర్ తాగి ఇద్దరు మృతి చెందారు. మద్యం తాగే అలవాటు ఉన్న తల్లీకొడుకులు మద్యం దొరక్కపోవడంతో మత్తు కోసం శానిటైజర్ ను తాగారు. తాగిన కొద్ది సేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్ది సేపటికే ప్రాణాలు విడిచారు. 

చెన్నూరు మండల కేంద్రంలోని ఎల్లమ్మ గుడి వీధిలో నివాసముండే విజయలక్ష్మీ, ఆమె కుమారుడికి మద్యం తాగే అలవాటు ఉంది. రాత్రి 10 గంటల సమయంలో మద్యం దొరక్కపోవడంతో శానిటైజర్ తాగారు. దీంతో కొద్ది సేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. గమనించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో తల్లీకొడుకులు చనిపోయారు. ఈ ఘటన స్థానికంగా విషాధం నింపింది. 

లాక్ డౌన్ నేపథ్యంలో చెన్నూరు మండలంలో ఇప్పటివరకు మద్యం విక్రయాలు జరుగడం లేదు. మద్యానికి బానిసలైన తల్లి విజయలక్ష్మీ, కుమారుడు శ్రీరామ్ నాయక్ ఇరువురు మద్యం కోసం ప్రయత్నం చేయగా ఎక్కడా మద్యం అందుబాటులో లేకపోవడంతో అందుబాటులో ఉన్న శానిటైజర్ ను మద్యం అనుకొని తాగారు.  అయితే ఇది కూడా మత్తు ఇస్తుందని ఎవరో చెప్పి నేపథ్యంలో మత్తు కోసమే శానిటైజర్ ను తాగారు. 

తాగిన కొద్ది సేపటికే ఇద్దరు కూడా అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని గమనించి స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు హుటాహుటినా వారిని ప్రత్యేక వాహనంలో కడప జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే చెన్నూరు నుంచి కడప ఆస్పత్రికి తరలించే లోపే ఇద్దరు మృత్యువాత పడ్డట్లు తెలుస్తోంది.