MP Avinash Reddy : తల్లికి అస్వస్థత .. సీబీఐ విచారణకు హాజరుకాని అవినాశ్ రెడ్డి

వైఎస్ వివేకా హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి మరోసాని సీబీఐ విచారణకు రావటంలేదు. అవినాశ్ రెడ్డి తల్లికి ఆరోగ్యం క్షీణించటంతో హైదరాబాద్ నుంచి పులివెందులకు బయలుదేరారు. దీంతో మరోసారి ఆయన సీబీఐ విచారణకు రాలేని పరిస్థితి నెలకొంది.

MP Avinash Reddy : తల్లికి అస్వస్థత .. సీబీఐ విచారణకు హాజరుకాని అవినాశ్ రెడ్డి

ycp mp avinash redd CBI

Updated On : May 19, 2023 / 11:19 AM IST

YS Viveka Case : వైఎస్ వివేకా హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి మరోసాని సీబీఐ విచారణకు రావటంలేదు. అవినాశ్ రెడ్డి తల్లికి ఆరోగ్యం క్షీణించటంతో హైదరాబాద్ నుంచి పులివెందులకు బయలుదేరారు. దీంతో మరోసారి ఆయన సీబీఐ విచారణకు గైర్హాజరయ్యారు. అవినాశ్ తల్లి చాతి నొప్పితో పులివెందులలోని ఈసీ గంగిరెడ్డి హాస్పిటల్ లో చేరారు. సీబీఐ విచారణకు హాజరుకావటానికి హైదరాబాద్ చేరుకున్న అవినాశ్ కు తల్లికి ఆరోగ్యం క్షీణించింది అనే సమాచారంతో పులివెందులకు తల్లిని చూసేందుకు హుటాహుటిన బయలుదేరారు. దీంతో ఈరోజు విచారణకు హాజరుకాలేకపోతున్నానని తన తల్లి ఆరోగ్యం బాగాలేదని మరో సారి హాజరు అవుతానాని సీబీఐకి సమాచారం ఇచ్చారు అవినాష్.

ఇప్పటికే ఈ కేసులో అవినాశ్ ఆరు సార్లు విచారణ ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో మరోసారి విచారణకు హాజరుకానున్న క్రమంలో సడెన్ గా తల్లి అనారోగ్యంపాలు కావటంతో హైదరాబాద్ నుంచి పులివెందులకు హుటాహుటిన బయలుదేరారు అవినాశ్. కాగా..మే 16వ తేదీన హాజరు కావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది. అయితే, తనకు ముందస్తు షెడ్యూల్‌లో భాగంగా ఇతర కార్యక్రమాలు ఉన్నాయని, నాలుగు రోజులు గడువు కావాలంటూ చివరి నిమిషంలో అవినాశ్‌ విచారణకు గైర్హాజరయ్యారు. కానీ ఈరోజు విచారణకు కచ్చితంగా హాజరుకావాల్సి ఉండగా మరోసారి తల్లి అనారోగ్యం వల్ల హాజరుకాలేని పరిస్థితి నెలకొంది.