తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ముక్కోటి ఏకాదశి

తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గోవింద నామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి.

  • Published By: veegamteam ,Published On : January 6, 2020 / 01:15 AM IST
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ముక్కోటి ఏకాదశి

Updated On : January 6, 2020 / 1:15 AM IST

తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గోవింద నామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం(జనవరి 6,2020) పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గోవింద నామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి.  భక్తులతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. తెల్లవారక ముందే భక్తులు ఆలయాలకు చేరుకున్నారు. ఉత్తర ద్వారంలో స్వామివారి దర్శనం చేసుకుని పులకిస్తున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలకు భక్తులు  పోటెత్తారు. వీఐపీ బ్రేక్ అనంతరం సర్వదర్శనానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. 

శ్రీవారి సేవలో వీఐపీలు:
వీఐపీ బ్రేక్ దర్శనంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర మహేశ్వరి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రైల్వే బోర్డు ఛైర్మన్ వినోద్ కుమార్, ఏపీకి చెందిన మంత్రులు పుష్ప శ్రీవాణి, పెద్దిరెడ్డి, అనిల్, అవంతి శ్రీనివాస్,  వెల్లంపల్లి శ్రీనివాస్, ఆదిమూలపు సురేష్, బాలినేని శ్రీనివాస్, తెలంగాణకు చెందిన మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు స్వామివారిని దర్శించుకున్నారు.

దక్షిణ అయోధ్యగా పిలుచుకునే భద్రాద్రిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులు భారీగా తరలివచ్చారు. ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారు. పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు  స్వామి వారిని దర్శనం చేసుకుంటున్నారు. మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోనూ ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభంవంగా సాగుతున్నాయి. కొన్ని ఆలయాల్లో అర్థరాత్రి 1.30 నుంచే వైకుంఠ ద్వార దర్శనం  ప్రారంభమైంది.

ఇసుకేస్తే రాలనంత జనం:
వైకుంఠ ఏకాదశి కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. తిరుమల కొండ జనంతో నిండిపోయింది. ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు. టీటీడీ పలు చోట్ల ఏర్పాటుచేసిన షెడ్లన్నీ భక్తులతో నిండాయి. నారాయణగిరి  ఉద్యానవనంలో సుమారు 30వేల మంది సేదదీరేలా 17 షెడ్లను నిర్మించారు. ఆలయ మాడవీధుల వెంట సుమారు 24వేల మంది విశ్రాంతి తీసుకునేలా షెడ్లు వేశారు. గ్యాలరీల్లో మరో 40వేల మంది వరకు విశ్రాంతి  తీసుకోవచ్చు. కల్యాణవేదికలోనూ సుమారు 4వేల మందికి వసతి కల్పిస్తున్నారు. 90వేల మందితో అన్ని వసతి కేంద్రాలు నిండిపోవడంతో మధ్యాహ్నం రెండింటి నుంచి క్యూలైన్ లోకి భక్తులను అనుమతించడం లేదు.  సోమవారం మధ్యాహ్నం వైకుంఠం క్యూకాంప్లెక్స్ నుంచి ద్వాదశి దర్శనానికి అనుమతిస్తారు. షెడ్లలో సేదదీరే సుమారు 60వేల మంది చలికి ఇబ్బంది పడకుండా టీటీడీ దుప్పట్లు ఇచ్చింది. మొబైల్ టాయిలెట్లు, ఇతర  వసతులను సమకూర్చింది.

పునర్జన్మ ఉండదు:
వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుంచి శ్రీ మహావిష్ణువును దర్శించుకున్న వారికి పునర్జన్మ ఉండదంటారు. ఈ రోజున స్వామి వారిని దర్శిస్తే ఏకంగా మోక్ష దాయకమే అని వేదాలు చెబుతున్నాయి. శ్రీవెంకటేశ్వర స్వామి భక్తులు పరమపవిత్రంగా భావించే ఆ వైకుంఠ ఏకాదశి ఇవాళే(జనవరి 6,2020). ధనుర్మాసం మొదలైన తరువాత వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అంటారు. ఇది మార్గశిరం లేదా పుష్యం మాసంలో గాని వస్తుంది. వైష్ణవులకు చాలా ముఖ్యమైనది. హిందువుల్లో అందరూ ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా, ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు.