MLA Vasantha Krishna Prasad : వైసీపీకి బిగ్‌షాక్..! పార్టీని వీడనున్న వసంత కృష్ణ ప్రసాద్.. ఏ పార్టీలో చేరుతున్నారంటే?
ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. నిన్న తన అనుచరులతో సుదీర్ఘంగా చర్చలు జరిపిన ఆయన.. ఇవాళకూడా అనుచరులతో సమాశమై తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు.

MLA Vasantha Krishna Prasad
Vasantha Krishna Prasad To Quit YCP: ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. నిన్న తన అనుచరులతో సుదీర్ఘంగా చర్చలు జరిపిన ఆయన.. ఇవాళకూడా అనుచరులతో సమాశమై తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. స్థానికంగా పార్టీలో అంతర్గత సమస్యల కారణంగా పలు సార్లు ఆయన తన అసంతృప్తిని బాహాటంగానే వెల్లగక్కారు. ఇటీవల దెందులూరులో జరిగిన సిద్ధం సభకుకూడా వసంత కృష్ణప్రసాద్ హాజరుకాలేదు అక్కడ ఇంచార్జిగా ఉన్న తిరుమల యాదవ్ ను మైలవరం అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం ప్రకటించింది.
వసంత కృష్ణ ప్రసాద్ మైలవరం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే, మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మరోసారి మైలవరం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమైన వసంత కృష్ణ ప్రసాద్ కు వైసీపీ అధిష్టానం షాకిచ్చింది. టికెట్ ఇచ్చేందుకు సీఎం జగన్ నిరాకరించారు. వసంత స్థానంలో మైలవరం నుంచి తిరుమల యాదవ్ పోటీ చేయబోతున్నారు. దీంతో వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం నియోజకవర్గంలో తన అనుచరులతో సమావేశం అయ్యారు. తాజాగా సోమవారం తన నివాసంలో నియోజకవర్గంలో ముఖ్యనేతలతో సమావేశం అయ్యారు. ఇవాళ సాయంత్రం వరకు తన భవిష్యత్ కార్యాచరణను వసంత కృష్ణ ప్రసాద్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
Also Read : జనసేనకు సీట్ల కేటాయింపుపై బుచ్చయ్య చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు
వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. అయితే, అతని వెంట ఎంత మంది వెళ్తారు.. వైసీపీని ఎంతమంది వీడబోతున్నారు అనే అంశం నియోజకవర్గంలో ఉత్కంఠగా మారింది. వసంత నిర్వహించిన సమావేశంకు పీఏసీఎస్ అధ్యక్షులు, నియోజకవర్గంలోని మరికొందరు ముఖ్యనేతలు హాజరయ్యారు. విషయం తెలుసుకున్న అధిష్టానం వసంత సమావేశంకు హాజరైన దాదాపు 25 మంది పీఏసీఎస్ అధ్యక్షులపై వేటు వేసింది. పీఏసీఎస్ అధ్యక్షుల పదవీ కాలం జనవరి 31తో పూర్తయింది.. అయితే, వారి పదవీ కాలంను పొడగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న క్రమంలో వసంత కృష్ణ ప్రసాద్ మీటింగ్ కు హాజరు కావడంతో వారిపై వైసీపీ అధిష్టానం వేటు వేసింది.