Nandamuri Lakshmi Parvati: ఆ ముగ్గురూ కమెడియన్లు.. నా పుస్తకంలో వాళ్ల గురించి హాస్యంగా రాశాను

గత 25 ఏళ్లుగా చంద్రబాబు గురించి అనేక పుస్తకాలు, వ్యాసాలు రాశాను. ప్రస్తుతం ‘అల్లుడు సుద్దులు’ పుస్తకాన్ని చిత్తూరు మాండలికంలో రాశానని నందమూరి లక్ష్మీపార్వతి తెలిపారు.

Nandamuri Lakshmi Parvati: ఆ ముగ్గురూ కమెడియన్లు.. నా పుస్తకంలో వాళ్ల గురించి హాస్యంగా రాశాను

Nandamuri Lakshmi Parvati

Updated On : July 25, 2023 / 1:23 PM IST

Lakshmi Parvati : వైసీపీ నేత, నందమూరి లక్ష్మీపార్వతి రచించిన పుస్తకం ‘అల్లుడు సుద్దులు’ పుస్తకావిష్కరణ సభ విజయవాడలో జరిగింది. ఈ సభలో నందమూరి లక్ష్మీపార్వతితో పాటు మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్, మీడియా అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డిలతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబుకు, నాకు మధ్య పోరాటం పిల్లి, ఎలుక పోరాటం వంటిదని అన్నారు.

Nandamuri Lakshmi Parvati : ఎన్టీఆర్ చనిపోయే ముందు చంద్రబాబు వల్ల తీవ్ర ఆందోళనకు గురయ్యారు : నందమూరి లక్ష్మి పార్వతి

గత 25 ఏళ్లుగా చంద్రబాబు గురించి అనేక పుస్తకాలు, వ్యాసాలు రాశానని చెప్పారు. ప్రస్తుతం ‘అల్లుడు సుద్దులు’ పుస్తకాన్ని చిత్తూరు మాండలికంలో రాశానని తెలిపారు. లోకేష్‌ను మంత్రిగా ఎవ్వరూ గుర్తించలేదని చెప్పిన లక్ష్మీపార్వతి.. చంద్రబాబు, లోకేష్, పవన్ కమెడియన్లుగా పేర్కొన్నారు. రాష్ట్రంలో తిరుగుతూ ప్రజలను ఎంటర్‌టైన్ చేస్తున్నారని, నా పుస్తకంలో వాళ్ల గురించి హాస్యంగా రాశానని లక్ష్మీ పార్వతి అన్నారు.

Chandra babu: కేంద్ర మంత్రి జయశంకర్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ..గత 20 ఏళ్లుగా లక్ష్మీ పార్వతి చంద్రబాబును, లోకేష్‌ను దగ్గరగా చూశారు. చంద్రబాబు 40 ఏళ్ల ఇండస్ట్రీలో ప్రజలను మోసం చేసిన తీరు అందరికీ తెలుసని అన్నారు. లక్ష్మీ పార్వతిని చంద్రబాబు ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. అల్లుడు సుద్ధులు పుస్తకాన్ని ప్రజలంతా చదవాలి. చంద్రబాబు చేసిన చెత్త పనులను తెలుసుకోవాలి అంటూ వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు.