Nara Bhuvaneshwari: ఆయనను అక్కడ కట్టిపడేశారు: జైల్లో చంద్రబాబును కలిశాక భువనేశ్వరి భావోద్వేగభరిత వ్యాఖ్యలు

ప్రజల కోసం పోరాడే మనిషి కోసం ప్రజలు పోరాడాలని అన్నారు. చంద్రబాబు జైల్లో..

Nara Bhuvaneshwari: ఆయనను అక్కడ కట్టిపడేశారు: జైల్లో చంద్రబాబును కలిశాక భువనేశ్వరి భావోద్వేగభరిత వ్యాఖ్యలు

Nara Bhuvaneshwari

Updated On : September 12, 2023 / 5:12 PM IST

Nara Bhuvaneshwari – TDP: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) జ్యుడీషియల్‌ రిమాండ్లో ఉండడంతో ఆయనను ఇవాళ ములాఖత్ లో కుటుంబ సభ్యులు కలిశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జైలులో చంద్రబాబుతో ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు నారా లోకేశ్, కోడలు నారా బ్రాహ్మణి మాట్లాడారు.

అనంతరం భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ.. ఏమని మాట్లాడమంటారని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు కష్టపడ్డారని, ఆయన జీవితం అంతా ప్రజల కోసం ధారపోశారని తెలిపారు. ఇప్పుడు కూడా జైల్లో ఆయన కుటుంబం కోసం మాట్లాడలేదని, ప్రజల గురించే మాట్లాడారని చెప్పుకొచ్చారు.

అలాగే, తాను బాగున్నానని, భయపడొద్దని చంద్రబాబు చెప్పారని భువనేశ్వరి తెలిపారు. జైలు నుంచి బయటకు వచ్చి ప్రజా సేవ చేస్తానని చెప్పారని అన్నారు.

ఆయనకు ముందు ప్రజలే ముఖ్యమని, తర్వాతే కుటుంబమని భువనేశ్వరి చెప్పారు. ఆయన నిర్మించిన బిల్డింగ్ లోనే ఆయనను కట్టిపడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన భద్రత గురించే తాను భయపడుతున్నామని చెప్పారు. ప్రజల కోసం పోరాడే మనిషి కోసం ప్రజలు పోరాడాలని అన్నారు. చంద్రబాబు జైల్లో ఉండడం ఫ్యామిలీకి చాలా కష్టమైన విషయమని చెప్పారు.

Chandrababu Arrest : చంద్రబాబుకి మరో షాక్.. హౌస్ రిమాండ్ పిటిషన్ కొట్టివేత