Nara Lokesh : యశస్వీ అరెస్టుపై స్పందించిన నారా లోకేశ్, అచ్చెన్నాయుడు.. మూల్యం చెల్లించక తప్పదంటూ వార్నింగ్

ఉగ్రవాదిని హింసించినట్లు యష్ తో సీఐడీ వ్యవహరించడం దుర్మార్గమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు.

Nara Lokesh : యశస్వీ అరెస్టుపై స్పందించిన నారా లోకేశ్, అచ్చెన్నాయుడు.. మూల్యం చెల్లించక తప్పదంటూ వార్నింగ్

Yashaswi Arrested

Updated On : December 23, 2023 / 11:05 AM IST

Yashaswi Arrested : ఎన్ఆర్ఐ బొద్దులూరి యశస్వీ (యష్)ని హైదరాబాద్ విమానాశ్రయంలో ఏపీ సీఐడీ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని చూసేందుకు యష్ స్వదేశానికి రావడంతో అదుపులోకి తీసుకున్నారు. అమెరికాలో యష్ సాప్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తూ భార్యాపిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. సోషల్ మీడియా వేదికగా సీఎం జగన్ మోహన్ రెడ్డి విధానాలను ప్రశ్నిస్తూ వస్తున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టారు. హైదరాబాద్ విమానాశ్రయంలో యష్ ను అదుపులోకి తీసుకున్న సీఐడీ అధికారులు గుంటూరు సీఐడీ కార్యాలయంకు తరలించారు. యష్ అరెస్టుపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. గుంటూరు సీఐడీ కార్యాలయం వద్ద యశస్వీ అరెస్టును ఖండిస్తూ ఆందోళనకు దిగారు. అక్రమ అరెస్టు అంటూ నినాదాలు చేశారు. తాజాగా యష్ అరెస్టుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు.

Also Read : Covid-19 cases : ఏపీలో కరోనా కలకలం.. విశాఖలో మూడు కేసులు నమోదు

ఉగ్రవాదిని హింసించినట్లు యష్ తో సీఐడీ వ్యవహరించడం దుర్మార్గమని నారా లోకేశ్ అన్నారు. ఎక్స్ (ట్విటర్) వేదికగా యష్ అరెస్టును తీవ్రంగా ఖండించారు. ప్రశ్నించే గొంతులను నిర్భందాల ద్వారా అణచివేయాలని వైసీపీ ప్రభుత్వం అనుకుంటోందని అన్నారు. అతన్ని ఉగ్రవాదిలా సీఐడీ అధికారులు ట్రీట్ చేస్తూ కొట్టారని నేను తెలుసుకున్నాను. ఇది కనీసం చెప్పడానికి భయంకరంగా ఉంది.. న్యాయం జరిగే వరకు విశ్రమించబోమని లోకేశ్ అన్నారు. అదేవిధంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చన్నాయుడు యష్ అరెస్టును తీవ్రంగా ఖండించారు. స్వేచ్ఛగా అభిప్రాయాన్ని వెల్లడించే హక్కు లేదా? ప్రభుత్వ తప్పులు, అవినీతిని ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా? అంటూ ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, జగన్ నియంతృత్వ పోకడలకు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.