Nara Lokesh : కొల్లు రవీంద్ర పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుపై నారా లోకేష్ ఆగ్రహం
అంతకముందు కొల్లు రవీంద్ర విషయంలో పోలీసులు హైడ్రామా నడిపారు. సైకిల్ యాత్ర వద్దంటూ ఉదయం కొల్లు రవీంద్రను అదుపులోకి తీసుకున్నారు. ఉదయం కొల్లు రవీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకుని రోడ్లపై తిప్పారు.

Nara Lokesh angry with police
Nara Lokesh Angry With Police : మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు పట్ల టీడీపీ నేత నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సైకిల్ యాత్ర చేస్తున్న ఒక మాజీ మంత్రిని ఇంతగా వేధిస్తారా అని మండిపడ్డారు. తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలు మినహా ఈ ప్రభుత్వంలో పాలన కనిపించడం లేదని విమర్శించారు. కొల్లు రవీంద్రని మచిలీపట్నంలోని ఆయన ఇంటి వద్ద పోలీసులు దింపారు. అయితే పోలీసులు తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని కొల్లురవీంద్ర వాపోయారు. పోలీసులపై ప్రయివేటు కేసు వేస్తానని చెప్పారు.
అంతకముందు కొల్లు రవీంద్ర విషయంలో పోలీసులు హైడ్రామా నడిపారు. సైకిల్ యాత్ర వద్దంటూ ఉదయం కొల్లు రవీంద్రను అదుపులోకి తీసుకున్నారు. ఉదయం కొల్లు రవీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకుని రోడ్లపై తిప్పారు. కొల్లు రవీంద్రను వాహనంలో ఎక్కించి 12 గంటలుగా తిప్పారు. నిడమోలు, కూచిపూడి, నాగాయలంక ప్రాంతాల్లో తిప్పారు. పోలీసుల వైఖరికి నిరసనగా రోడ్డుపై కొల్లు రవీంద్ర బైఠాయించారు.
Kinjarapu Atchannaidu : కొల్లు రవీంద్ర ఎక్కడ? దుర్మార్గం అంటూ పోలీసుల తీరుపై అచ్చెన్నాయుడు ఫైర్
నాగాయలంక పోలీస్ స్టేషన్ నుండి పోలీస్ లు అతన్ని అజ్ఞాతంలోకి తీసుకుని వెళ్లారు. నాగాయలంక తర్వాత వెనుక వస్తున్న ఆయన అనుచరుల వాహనాలను దారి మళ్లించి కొల్లు రవీంద్రను పోలీస్ వాహనం అజ్ఞాతంలోకి తీసుకుని వెళ్లింది. దీంతో కొల్లు రవీంద్ర అదృశ్యంపై కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు హౌజ్ మోషన్ పిటిషన్ కు సిద్ధమయ్యారు.
తన తండ్రి ఆచూకీ తెలపాలంటూ కొల్లు రవీంద్ర కొడుకు పునీత్ చంద్ర జిల్లా ఎస్పీని కలిశారు. కొల్లు రవీంద్రకు మద్దతుగా వెళ్లిన మండలి బుద్ధ ప్రసాద్ తనయడు మండలి వెంకట్రామ్ ను అరెస్టు చేశారు. వెంకట్రామ్ ని అదుపులోకి తీసుకుని గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు పోలీస్ స్టేషన్ కి తరలించారు. చివరికి కొల్లు రవీంద్రని మచిలీపట్నంలోని ఆయన ఇంటి వద్ద పోలీసులు దింపి వెళ్లారు.