పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ లోకేశ్ కీరోల్.. ఏం జరుగుతోంది?
ప్రధాని మోదీ విశాఖ పర్యటనలోనూ లోకేశ్‌తో సెపరేటుగా మాట్లాడారు. ఢిల్లీకి వచ్చి తనను కలవాలంటూ అపాయింట్‌మెంట్ కూడా ఇచ్చారు.

లోకేశ్.. చంద్రబాబు వారసుడిగా పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన తనను తానూ లీడర్‌గా ప్రూవ్ చేసుకునే విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. ఏపీకి నిధులు రాబట్టే విషయంలోనైనా..అపోజిషన్‌కు కౌంటర్ ఇవ్వడంలోనైనా..చివరికి ఏపీ, తెలంగాణ మధ్య ఉన్న వాటర్ ఇష్యూస్‌పై కూడా తన వెర్షన్ ఏంటో వినిపించి..ఆయన సెంట్రిక్‌గా చర్చ జరిగేలా చేశారు లోకేశ్.
మామూలుగా అయితే పారిశ్రామిక వేత్తలతో భేటీ అయినా..సింగపూర్ పర్యటనకు వెళ్లి పెట్టుబడులు తెచ్చినా సీఎం చంద్రబాబు మీడియా ముందుకు వచ్చి..ఎన్ని పెట్టుబడులు తెచ్చామో..ఎక్కడెక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయబోతున్నారో క్లియర్ కట్‌గా చెప్పేశారు. కానీ ఈసారి చంద్రబాబుకు బదులు లోకేశ్ ప్రెస్‌మీట్ పెట్టి..ఏపీ టు తెలంగాణ..టీడీపీ టు వైసీపీ వయా జనసేన..ఇలా అన్ని అంశాలపై కన్‌ఫ్యూజన్ లేకుండా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
సింగపూర్ పర్యటనతో ఏపీకి రూ.45 వేల కోట్ల పెట్టుబడులు రానున్నట్లు చెప్పిన లోకేశ్..జగన్ హయాంలో మధ్య బ్రాండ్ ఆంధ్రప్రదేశ్‌ను పూర్తిగా నాశనం చేశారని ఆరోపించారు. విశాఖను ఐటీ హబ్‌గా డెవలప్ చేయాలనేది తమ ప్లాన్ అని చెప్పుకొచ్చిన ఆయన..ఈ క్రమంలో బనకచర్ల ప్రాజెక్ట్, జగన్ అరెస్ట్ ఇలా అన్ని అంశాలను టచ్ చేస్తూ..లోకేశ్ మాట్లాడిన తీరు ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది. ఏ విషయంలోనూ హైరాన పడకుండా చాలా జాగ్రత్తగా మీడియాను అడ్రస్ చేశారు యువనేత.
పైగా ప్రభుత్వం తరఫున అఫీషియల్ వాయిస్‌గా ఇన్ అండ్ అన్ని టాపిక్స్‌పై ఆన్సర్ చేశారు. సెన్సిటీవ్ ఇష్యూగా ఉన్న బనకచర్లపై ఏపీ సర్కార్ స్టాండ్‌ను చెప్పేశారు లోకేశ్. రాజకీయ ప్రయోజనాల కోసమే బనకచర్లపై రాద్ధాంతం చేస్తున్నారన్న ఆయన.. సముద్రంలోకి వెళ్లే మిగులు జలాలను ఉపయోగించుకుంటే తప్పేంటి? అంటూ ప్రశ్నించారు.
డిప్యూటీ సీఎం అని, సీఎం అని ఎలివేషన్
కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు తీసుకునే తెలంగాణ ప్రభుత్వం నిర్మించిందా అంటూ కీలక వ్యాఖ్యలు చేసి..బీఆర్ఎస్ లీడర్లు ప్రెస్‌మీట్ పెట్టేలా చేశారు. జగన్ అరెస్ట్ ఉంటుందా అంటూ మీడియా ప్రశ్నిస్తే కూడా అరెస్ట్ ఉంటుందని కానీ..అరెస్ట్ చేయమని కాని చెప్పుకుండా చట్టం తన పని తాను చేసుకుంటూపోతుందని చెప్పుకొచ్చారు.
టీడీపీలోకి అయినా..ఆ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినా ఫ్యూచర్ లీడర్ లోకేశే. ఈ విషయంలో అందరికీ క్లారిటీ ఉంది. అందుకే ఇప్పటికే సొంత పార్టీ నేతలు ఆయన డిప్యూటీ సీఎం అని, సీఎం అని ఎలివేషన్ ఇస్తున్నారు. బీజేపీ పెద్దలు కూడా ప్రయారిటీ ఇస్తున్నారు. అయినా లోకేశ్ అవసరం లేని హడావుడి చేయట్లేదు. అలా అని మంత్రులు, వారి అనుచరుల తీరుతో ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వచ్చేలా బిహేవ్ చేస్తే లైట్ తీసుకోవడం లేదు. ఇటు ప్రభుత్వంలో..అటు పార్టీ పరంగా తన అవసరం ఉన్న దగ్గర అన్నీ తానై మాట్లాడుతున్నారు. నిధుల కోసం కేంద్ర పెద్దలను కలిసి విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నారు.
మంగళగిరి ఎమ్మెల్యే. ప్రభుత్వంలో కీలక శాఖకు మంత్రి. అక్కడి వరకే పరిమితం కావడం లేదు మినిస్టర్ నారా లోకేశ్. అలా అని మిగతా మంత్రుల శాఖల్లో వేలు పెట్టడం లేదు. డామినేషన్ చూపించట్లేదు. హడావుడి, హంగామా అసలే లేదు. ఆ మధ్య ఢిల్లీ వెళ్లి వరుస పెట్టి కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నిధులు, పెట్టుబడుల కోసం ఏపీ ప్రభుత్వం తరఫున ప్రయత్నాలు చేస్తున్నారు లోకేశ్. బీజేపీ పెద్దలు, కేంద్ర మంత్రులు కూడా చంద్రబాబు వారసుడిగా, ఏపీ మంత్రిగా లోకేశ్ మంచి ప్రయారిటీ ఇస్తుండటం ఆసక్తికరంగా మారింది.
ప్రధాని మోదీ విశాఖ పర్యటనలోనూ లోకేశ్‌తో సెపరేటుగా మాట్లాడారు. ఢిల్లీకి వచ్చి తనను కలవాలంటూ అపాయింట్‌మెంట్ కూడా ఇచ్చారు. తాజా ప్రెస్‌మీట్‌తో మరోసారి లోకేశ్ తన మార్క్ చూపించారు. ఏపీ ప్రభుత్వం తరఫున కీలక అంశాలపై చంద్రబాబు తప్ప ఎవరు మాట్లాడినా..ప్రభుత్వం స్టాండ్ ఏంటో అంత క్లారిటీ ఉండకపోవచ్చు. బట్ లోకేశ్ కామెంట్స్‌తో కాళేశ్వరం టు బనకచర్లతో..వైసీపీకి సంబంధించిన అంశాలపై కూడా క్లారిటీ ఇచ్చేశారు. దీంతో చంద్రబాబు తర్వాత లోకేశ్..ఇక పార్టీలో ప్రభుత్వంలో అంతా చిన్నబాబే అంటూ మరోసారి ప్రచారం బయలుదేరింది.