Nara Lokesh: వైసీపీ నేతల బూతులు..పోలీసులకు వినసొంపుగా ఉన్నాయా?: లోకేష్
నర్సీపట్నంలో టీడీపీ నేత అయ్యన్న పాత్రుడికి నోటీసులు ఇచ్చేందుకు ఇతర జిల్లా పోలీసులు రావడంపై స్పందించిన నారా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు

Lokesh
Nara Lokesh: తెలుగుదేశం నేతలు వాస్తవాలు మాట్లాడితే కేసులు పెడుతున్న పోలీసులకు.. ఉచ్ఛనీచాలు మరచి మాట్లాడుతున్న వైసీపీ నేతల బూతులు వినసొంపుగా ఉన్నాయా? అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘాటు విమర్శలు చేశారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో టీడీపీ నేత అయ్యన్న పాత్రుడికి నోటీసులు ఇచ్చేందుకు ఇతర జిల్లా పోలీసులు రావడంపై స్పందించిన నారా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. బుధవారం ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ స్పందిస్తూ వైసిపి నేతల తీవ్ర వ్యాఖ్యలపై కేసులు పెడితే కనీసం స్పందించని పోలీసులు.. జిల్లాలు దాటి మరీ టిడిపి నేతల్ని అరెస్ట్ చేయడానికి రావడమే రాజారెడ్డి రాజ్యాంగం ప్రత్యేకత అని అన్నారు.
Also read: Mekapati Goutham Reddy : ముగిసిన గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు.. పాల్గొన్న సీఎం జగన్ దంపతులు
“మా అయ్యన్నపాత్రుడు గారు వాస్తవాలు మాట్లాడితేనే కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి వస్తే.. వైసిపి నేతలు చెప్పే అబద్ధాలు-మాట్లాడే బూతులకి డైరెక్ట్ గా ఉరి వెయ్యాలి” అంటూ లోకేష్ తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు. “పోలీసుల చొక్కా పట్టుకొని తిడుతున్న మంత్రులు, బీరు బాటిళ్లు పగలగొట్టి ఏం పీకుతారు అని సవాల్ చేస్తున్న వైసిపి నేతలపై పోలీసులు తమ ప్రతాపాన్ని చూపి ప్రజాస్వామ్యాన్ని కాపాడితే.. కనీసం వేసుకున్న ఖాకీ గౌరవాన్ని నిలబెట్టినవారవుతారని” లోకేష్ అన్నారు. టిడిపి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడుపై పెట్టిన తప్పుడు కేసులు వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు.
Also read: YS Viveka Reddy : వివేకా హత్య కేసులో సంచలన విషయాలు
మరోవైపు పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల నుంచి వచ్చిన పోలీసులు విశాఖ జిల్లా నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడి ఇంటివద్ద భైఠాయించారు. ఇటీవల నల్లజర్లలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు వెళ్లిన అయ్యన్న పాత్రుడు..సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ..స్థానిక వైసీపీ నేత రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలంటూ నోటీసు ఇచ్చేందుకు నల్లజర్ల సీఐ రఘు, ఎస్ఐలు శ్రీహరి రావు, అవినాష్ లు.. నర్సీపట్నంలో అయ్యన ఇంటికి చేరుకున్నారు. అయితే అయ్యన్న పాత్రుడు ఇంటిలో లేరంటూ కుటుంబ సభ్యులు చెప్పగా.. ఆయన వచ్చే వరకు ఇక్కడే ఉండి నోటీసులు ఇచ్చాకే వెళ్తామంటూ తన సిబ్బందితో కలిసి సీఐ అక్కడే భైఠాయించారు.
మా @AyyannaPatruduC గారు వాస్తవాలు మాట్లాడితేనే కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి వస్తే వైసిపి నేతలు చెప్పే అబద్ధాలు-మాట్లాడే బూతులకి డైరెక్ట్ గా ఉరి వెయ్యాలి. ఉచ్ఛనీచాలు మరచి వైసిపి నేతలు మాట్లాడుతున్న బూతులు పోలీసులకు వినసొంపుగా ఉంటున్నాయి.(1/3) pic.twitter.com/3ZCgYbZ5uR
— Lokesh Nara (@naralokesh) February 23, 2022