TG Bharath : కాబోయే ముఖ్యమంత్రి లోకేశే- మంత్రి టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు, సీఎం చంద్రబాబు ముందే..
175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు, రాజ్యసభ ఎంపీలలో స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ నుంచి చదివిన వాళ్లు ఎవరూ లేరు.

TG Bharath : జ్యురిచ్ పర్యటనలో ఏపీ మంత్రి టీజీ భరత్ హాట్ కామెంట్స్ చేశారు. భవిష్యత్ లో నారా లోకేశే సీఎం అవుతారని ఆయన అన్నారు. ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా లోకేశ్ ముఖ్యమంత్రి అవడం ఖాయం అని తెలిపారు. లోకేశ్ టీడీపీ డైనమిక్ లీడర్ అని ఆయన అభివర్ణించారు. ఎప్పుడు ఏం చేయాలో ఆయనకు తెలుసన్నారు మంత్రి టీజీ భరత్. టీడీపీ ఫ్యూచర్ ఎవరంటే కచ్చితంగా లోకేశ్ పేరు వినిపిస్తుందని టీజీ భరత్ వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు సమక్షంలోనే టీజీ భరత్ చేసిన ఈ వ్యాఖ్యలు కూటమి నేతల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా పార్టీ భవిష్యత్తు లోకేశే..
”లోకేశ్.. మోస్ట్ డైనమిక్ యూత్ లీడర్. ఉన్నత విద్యావంతుడు. 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు, రాజ్యసభ ఎంపీలలో స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ నుంచి చదివిన వాళ్లు ఎవరూ లేరు. ఒక్క లోకేశ్ మాత్రమే. ఆయన ఉన్నత విద్యావంతుడు. ఆయనకు అన్నీ తెలుసు. ఎప్పుడే ఏం చేయాలో, ఏది చేయకూడదో అవగాహనం ఉంది. ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా పార్టీ భవిష్యత్తు లోకేశే. కాబోయే ముఖ్యమంత్రి కూడా నారా లోకేశే” అని టీజీ భరత్ అన్నారు.
చర్చకు దారితీసిన భరత్ వ్యాఖ్యలు..
టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలు కూటమి పార్టీల్లో చర్చకు దారితీసింది. టీజీ భరత్ కామెంట్స్ పై జనసేన, బీజేపీ నేతల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో అన్న ఆసక్తి నెలకొంది. కాగా, లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ కొన్ని రోజులుగా కొందరు టీడీపీ నేతలు చేస్తున్న డిమాండ్లు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అటు, పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నామని కొందరు జనసేన నేతలు కూడా అనడం.. ఈ అంశాన్ని మరింత ఆసక్తికరంగా మార్చేసింది.
Also Read : విశాఖ సాగర తీరంలో బొత్స రాజకీయ ఎత్తులు.. వచ్చే ఎన్నికల్లో తన కొడుకును బరిలోకి దింపే ప్లాన్?
ఈ వ్యవహారం పై చర్చ జరుగుతుండటంతో.. టీడీపీ హైకమాండ్ స్పందించింది. దీనిపై సీరియస్ అయ్యింది. లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే అంశంపై ఎవరూ మాట్లాడొద్దని టీడీపీ నేతలకు అధిష్టానం ఆదేశాలు ఇచ్చింది. లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలని ఎవరూ మీడియా ముందు బహిరంగ ప్రకటనలు చేయొద్దని సూచించింది.
ఏ నిర్ణయమైనా కూటమి అధ్యక్షులు మాట్లాడుకుంటారని టీడీపీ హైకమాండ్ స్పష్టం చేసింది. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దని పార్టీ అధినాయకత్వం తేల్చి చెప్పింది. ఓవైపు ఎవరూ మాట్లాడొద్దని హైకమాండ్ ఆదేశాలు ఇస్తే.. మంత్రి టీజీ భరత్ మాత్రం.. కాబోయే సీఎం లోకేశే అనడం డిస్కషన్ కు దారితీసింది.
Also Read : లోకేశ్ డిప్యూటీ సీఎం కావాలంటున్న సైకిల్ పార్టీ నేతలు.. తమ నేతను సీఎంగా చూడాలనుకుంటున్నామన్న జనసేన