Nara lokesh: కార్యకర్తకు నారా లోకేష్ పరామర్శ

ఇటీవల చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో గాయపడ్డ కార్యకర్త నవీన్‌ను పరామర్శించారు టీడీపీ నేత నారా లోకేష్.

Nara lokesh: కార్యకర్తకు నారా లోకేష్ పరామర్శ

Nara Lokesh

Updated On : April 21, 2022 / 4:39 PM IST

Nara lokesh: ఇటీవల చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో గాయపడ్డ కార్యకర్త నవీన్‌ను పరామర్శించారు టీడీపీ నేత నారా లోకేష్. గుంటూరు జిల్లాలోని మణిపాల్ ఆసుపత్రిలో నవీన్ చికిత్స పొందుతున్నాడు. నవీన్ పరిస్థితి విషమంగా ఉండటంతో స్వయంగా లోకేష్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించాడు. నవీన్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నాడు. మరోవైపు నవీన్‌కు, అతడి కుటుంబానికి పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.