వైసీపీకి బిగ్ షాక్? టీడీపీ గూటికి వైసీపీ ఎంపీ?
గంటన్నరపాటు ఇద్దరూ సమావేశం అయినట్లు వార్తలు వస్తున్నాయి. తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురూ మాట్లాడుకున్నట్లు సమాచారం.

Sri Krishna Devarayalu Lavu To Join TDP
Sri Krishna Devarayalu Lavu : నరసరావుపేట ఎంపీ వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారా? వైసీపీని వీడి టీడీపీలో చేరనున్నారా? ఇప్పుడీ ప్రశ్నలు హాట్ టాపిక్ గా మారాయి. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీ అధినేత చంద్రబాబును కలిసినట్లు సమాచారం. బుధవారం సాయంత్రం హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో ఇరువురూ భేటీ అయినట్లు తెలుస్తోంది. గంటన్నరపాటు ఇద్దరూ సమావేశం అయినట్లు వార్తలు వస్తున్నాయి. తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురూ మాట్లాడుకున్నట్లు సమాచారం. దీంతో లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీని వీడతారనే ప్రచారం జోరందుకుంది.
గుంటూరు, నరసరావుపేట లోక్ సభ స్థానాల్లో ఏదైనా పర్వాలేదనే ఆప్షన్ ను శ్రీకృష్ణదేవరాయలుకే చంద్రబాబు వదిలేశారని సమాచారం. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుతో పాటు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావు కూడా టీడీపీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. తన కుటుంబసభ్యులు, అనుచరులతో మాట్లాడి శ్రీకృష్ణదేవరాయలు త్వరలో టీడీపీలో చేరనున్నారని సమాచారం.
ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాల్లో వేగంగా మారిపోతున్నాయి. వైసీపీలో టికెట్ దక్కని వారు పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే పలువురు కండువా మార్చేశారు. మరికొందరు పార్టీ మారే యోచనలో ఉన్నారు. తాజాగా మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. నరసరావుపేట వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చంద్రబాబును కలిశారు అనే వార్త వైసీపీ శ్రేణుల్లో కలకలం రేపింది. ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచింది.
Also Read : జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు దేనికి సంకేతం? వివాదానికి అసలు కారణం ఏంటి?
ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ ఇంఛార్జుల మార్పులు చేర్పుల్లో భాగంగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుని.. ఈ ఎన్నికల్లో గుంటూరు ఎంపీ స్థానం నుంచి బరిలోకి దింపాలని సీఎం జగన్ భావించారు. అయితే, గుంటూరు నుంచి పోటీ చేసేందుకు లావు కృష్ణదేవరాయలు నిరాకరిస్తున్నారు. నరసరావుపేట నుంచే బరిలోకి దిగుతానని తేల్చి చెప్పారు. అయితే, అందుకు వైసీపీ అధినాయకత్వం ఒప్పుకోవడం లేదు. దీంతో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అధిష్టానానికి కొంత దూరంగా ఉంటున్నారు. సీఎంవో కార్యాలయానికి ఆహ్వానించినా ఆయన వెళ్లడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు లోకేశ్, చంద్రబాబును కలిశారు అనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఎంపీ లావు కృష్ణదేవరాయలు హైదరాబాద్ లో చంద్రబాబు నివాసంలో చంద్రబాబు భేటీ అయినట్లు తెలుస్తోంది. గంటన్నర పాటు సమావేశం అయినట్లు చెబుతున్నారు. క్లీన్ ఇమేజ్ ఉన్న నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలుకి గుర్తింపు ఉంది. యంగ్ ఎంపీగా ఢిల్లీలోనూ మంచి పేరు ఉంది.
Also Read : జగనన్న బాణం రివర్స్‌లో వస్తోంది, ఈసారి పులివెందులలో కూడా టీడీపీ గెలుస్తుంది- చంద్రబాబు
కాగా గుంటూరు, నరసరావుపేట.. ఈ రెండు లోక్ సభ స్థానాల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలనే ఛాయిస్ ను లావు శ్రీకృష్ణదేవరాయలుకే చంద్రబాబు ఇచ్చినట్లు సమాచారం. జనసేనతో పొత్తులో ఉన్నప్పటికీ.. ఈ రెండు స్థానాల్లోనూ టీడీపీ అభ్యర్థులే పోటీ చేయనున్నారు. పొత్తులో భాగంగా ఈ స్థానాలు జనసేనకు వెళ్లే అవకాశం లేదని తెలుస్తోంది. ఇక, గుంటూరు ఎంపీగా ప్రస్తుతం గల్లా జయదేవ్ ఉన్నారు. ఆయన స్వయంగా చంద్రబాబుకి శ్రీకృష్ణదేవరాయలు పేరు ప్రపోజ్ చేసినట్లు సమాచారం. శ్రీకృష్ణదేవరాయలు మంచి వ్యక్తి, ఢిల్లీలో మంచి సంబంధాలు కలిగిన వ్యక్తిగా పేరు పొందారు కాబట్టి.. పార్టీకి కూడా ప్రయోజనకరంగా ఉంటుందని శ్రీకృష్ణదేవరాయలు పేరును గల్లా జయదేవ్ సజెస్ట్ చేశారని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.