Narayana Swamy: సీఎం జగన్ టికెట్లు జాగ్రత్తగా ఇవ్వాలి.. లేదంటే..: డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
గతంలో ఇలా టికెట్లు ఇవ్వడం వల్లే వైసీపీని 23 మంది ఎమ్మెల్యేలు వదిలి వెళ్లారని గుర్తు చేశారు. టీడీపీ నుంచి..

Deputy CM Narayana Swamy
AP Deputy CM Narayana Swamy: ఏపీ ఎన్నికల్లో సీఎం జగన్ వైసీపీ టికెట్లను జాగ్రత్తగా ఇవ్వాలంటూ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లాలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చే వారికి టికెట్లు ఇస్తున్నారని అన్నారు.
వారి వ్యక్తిత్వాన్ని చూసి టికెట్లు ఇవ్వాలని నారాయణ స్వామి చెప్పారు. గతంలో ఇలా టికెట్లు ఇవ్వడం వల్లే వైసీపీని 23 మంది ఎమ్మెల్యేలు వదిలి వెళ్లారని గుర్తు చేశారు. టీడీపీ నుంచి కోవర్టులుగా వచ్చి ఎస్సీ నియోజక వర్గాల్లో టికెట్ అడుగుతున్నారని ఆరోపించారు.
అటువంటి వారు జగన్‌ను ముంచేస్తారన్నారు. ఇటీవలే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాళ్లను సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం మొక్కారని వార్తలు వచ్చాయని గుర్తుచేశారు. టికెట్ కోసం ఎవరో ఒకరి కాళ్లు పట్టుకోవాలి కదా? అని అన్నారు.
తాము ఇంకేం చేయగలమని నారాయణ స్వామి వాపోయారు. జగన్ కాళ్లు పట్టుకోడానికి తాను కూడా సిద్ధమేనని చెప్పారు. కాగా, ఎన్నికల వేళ ఆశావహులు టికెట్ల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
Also Read: ఎమ్మెల్యేలు, మంత్రుల్లో టెన్షన్ టెన్షన్.. మూడో జాబితాపై సీఎం జగన్ కసరత్తు