ఇది నేను ఇస్తున్న గ్యారెంటీ: ‘ప్రజాగళం’ సభలో మోదీ కామెంట్స్

ఎన్నికల షెడ్యూల్ నిన్ననే విడుదలైందని చెప్పారు. ఎన్డీఏకు 400 సీట్లు రావాలని..

ఇది నేను ఇస్తున్న గ్యారెంటీ: ‘ప్రజాగళం’ సభలో మోదీ కామెంట్స్

Narendra Modi

పేదల అభ్యున్నతికి కృషి చేస్తామని, ఇది తాను గ్యారెంటీ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఏపీలోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట, బొప్పూడిలో టీడీపీ-జనసేన-బీజేపీ నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో మోదీ మాట్లాడారు.

‘నా ఆంధ్ర కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ నమస్కారం’ అంటూ ఆయన ప్రసంగాన్ని మొదలు పెట్టారు. ఎన్నికల షెడ్యూల్ నిన్ననే విడుదలైందని చెప్పారు. ఎన్డీఏకు 400 సీట్లు రావాలని, తమకు ఓటేయాలని కోరారు. ఎన్నికల ఫలితాలు జూన్ 4న రాబోతున్నాయని చెప్పారు. దేశ, రాష్ట్ర ప్రగతి కోసం ఎన్డీఏ రావాలని అన్నారు.

దేశంలోని అన్ని రాష్ట్రాల ఆశలను నెరవెర్చుతూ ఎన్డీఏ పని చేస్తోందని చెప్పారు. వికసిత్ భారత్, వికసిత్ ఏపీ తమ లక్ష్యమని తెలిపారు. ఎన్డీఏ కూటమి బలం పుంజుకుంటోందని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం పేదల కోసం ఎన్నో పథకాలు పెట్టిందని తెలిపారు. ఏపీలో జల్ జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల ద్వారా లబ్ధి పొందారని చెప్పారు. తాము పీఎం కిసాన్ ద్వారా రైతులకు మేలు చేస్తున్నామన్నారు
.

Kishan Reddy : అప్పటివరకు వెంటాడతాం- కాంగ్రెస్ ప్రభుత్వానికి కిషన్ రెడ్డి వార్నింగ్