NEET Exam Results : నీట్ పరీక్ష ఫలితాలు విడుదల

  • Published By: sreehari ,Published On : October 16, 2020 / 07:39 PM IST
NEET Exam Results : నీట్ పరీక్ష ఫలితాలు విడుదల

Updated On : October 16, 2020 / 8:01 PM IST

దేశ వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశపరీక్ష (నీట్) ఫలితాలు రిలీజ్ అయ్యాయి. వైద్య కళాశాలల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన నీట్ పరీక్ష ఫలితాలను జాతీయ పరీక్షల ఏజెన్సీ (NTA) శుక్రవారం సాయంత్రం రిలీజ్ చేసింది.



MBBS, BDS కోర్సుల్లో (2020-21) అడ్మిషన్ల కోసం దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 13న నీట్ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు 14.37లక్షల మందికిపైగా 90శాతం మందితో హాజరయ్యారు. కరోనా నిబంధనలను పాటిస్తూనే నీట్ పరీక్షను 3,862 కేంద్రాల్లో జాగ్రత్త చర్యలతో నిర్వహించారు.



నీట్ పరీక్షకు హాజరు కాని విద్యార్థుల కోసం ఈ నెల 14న ప్రత్యేకంగా నీట్ పరీక్ష రాసే అవకాశం కల్పించారు. ఈ పరీక్ష ఫలితాలను వెబ్ సైట్ ntaneet.nic.in ద్వారా విడుదల చేశారు.



నీట్ ఫలితాలు విడుదల తర్వాత వెబ్ సైట్ మొరాయించింది. విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్వర్ డౌన్ అయిందని వెబ్‌సైట్‌ను రిఫ్రెష్ చేస్తున్నా ఓపెన్ కావడంలేదని ట్విట్టర్ ద్వారా ఫిర్యాదులు చేశారు.