Tirumala Vaccination Certificate : తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. ఆ సర్టిఫికెట్ ఉంటేనే అనుమతి
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేదా దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్టీపీసీఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకురావాలని..

Tirumala Certificate
Tirumala Vaccination Certificate : తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేదా దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్టీపీసీఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకురావాలని టీటీడీ కోరింది. ఇదివరకే టీటీడీ ఈ విషయాన్ని తెలియజేసింది. అయినా, కొంతమంది భక్తులు నెగెటివ్ సర్టిఫికెట్ లేకుండా స్వామి దర్శనం కోసం వస్తుండడంతో అలిపిరి చెక్ పాయింట్ దగ్గర నిఘా, భద్రతా సిబ్బంది తనిఖీ చేసి అటువంటి వారిని వెనక్కి పంపాల్సి వస్తోంది. ఈ కారణంగా భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు.
Garlic : రోజూ వెల్లుల్లి తీసుకుంటే బరువు తగ్గవచ్చా?
కోవిడ్-19 థర్డ్ వేవ్ ఒమిక్రాన్ రూపంలో దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కచ్చితంగా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేదా దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్టీపీసీఆర్ పరీక్ష నెగెటివ్ సర్టిఫికెట్ ను అలిపిరి చెక్ పాయింట్ దగ్గర
చూపించిన వారిని మాత్రమే తిరుమలకు అనుమతిస్తారు.
Lemon Juice : గ్యాస్ సమస్య ఉంటే తేనె, నిమ్మరసం కలిపి తీసుకోకూడదా?
తిరుమలలో పని చేసే ఉద్యోగులు, సిబ్బంది, వేలాది మంది సహ భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బందికి సహకరించాలని టీటీడీ కోరింది. అలాగే టీటీడీకి సంబంధించిన ఇతర ఆలయాల్లో కూడా ఈ కోవిడ్ నిబంధనలు విధిగా పాటించాలని భక్తులను కోరింది.
మరోవైపు జనవరి నెలకు సంబంధించి శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లను ఈరోజు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయగా, కేవలం గంట వ్యవధిలోనే టికెట్లు అమ్ముడయ్యాయి. జనవరి నెలకు గాను మొత్తం 4.60 లక్షలను టీటీడీ ఆన్ లైన్ లో ఉదయం 9గంటలకు విడుదల చేయగా… కేవలం 60 నిమిషాల్లో భక్తులు టికెట్లను కొనుగోలు చేశారు. జనవరి నెలకు సంబంధించి సర్వదర్శనం టికెట్లను ఇంకా విడుదల చేయాల్సి ఉంది. జనవరికి సంబంధించి వసతి బుకింగ్స్ ను ఈ నెల 27వ తేదీన ఉదయం 9 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.