గుడ్ న్యూస్, కరోనాను జయించాడు, ఏపీలో తొలి కరోనా బాధితుడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్

ఏపీలో తొలి కరోనా బాధితుడు కోలుకున్నాడు. నెల్లూరు యువకుడు కరోనాను జయించాడు. అతడికి కరోనా పూర్తిగా నయమైంది. సోమవారం(మార్చి 23,2020) రాత్రి డాక్టర్లు ఆ

  • Published By: veegamteam ,Published On : March 23, 2020 / 02:48 PM IST
గుడ్ న్యూస్, కరోనాను జయించాడు, ఏపీలో తొలి కరోనా బాధితుడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్

Updated On : March 23, 2020 / 2:48 PM IST

ఏపీలో తొలి కరోనా బాధితుడు కోలుకున్నాడు. నెల్లూరు యువకుడు కరోనాను జయించాడు. అతడికి కరోనా పూర్తిగా నయమైంది. సోమవారం(మార్చి 23,2020) రాత్రి డాక్టర్లు ఆ

ఏపీలో తొలి కరోనా బాధితుడు కోలుకున్నాడు. నెల్లూరు యువకుడు కరోనాను జయించాడు. అతడికి కరోనా పూర్తిగా నయమైంది. సోమవారం(మార్చి 23,2020) సాయంత్రం 6 గంటల సమయంలో డాక్టర్లు ఆ యవకుడిని నెల్లూరు జనరల్ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డు నుంచి డిశ్చార్జ్ చేశారు. అంబులెన్స్ లో ఇంటికి పంపారు. అయితే 14 రోజులు హోం క్వారంటైన్ లో ఉండాలని అతడికి సూచించారు. అతడు పూర్తిగా కోలుకున్నాడని డాక్టర్లు తెలిపారు. కరోనా లక్షణాలతో మార్చి 9న బాధితుడు ఆసుపత్రిలో చేరాడు. ఏపీలో ఇతడే తొలి కరోనా బాధితుడు. రాష్ట్రంలో నమోదైన తొలి కరోనా పాజిటివ్ కేసును సమర్థవంతంగా ఎదుర్కోవడంతో డాక్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

బాధితుడు మార్చి 6న ఇటలీ నుంచి నెల్లూరు వచ్చాడు. రెండు రోజుల తర్వాత అనారోగ్యానికి గురయ్యాడు. దగ్గు, జ్వరం లక్షణాలు బయటపడ్డాయి. కరోనా లక్షణాలు కనిపించడంతో అతడు అలర్ట్ అయ్యాడు. మార్చి 9న నెల్లూరు జనరల్ ఆసుపత్రికి వెళ్లాడు. అతడిని ఐసోలేషన్ వార్డులో చేర్చి డాక్టర్లు చికిత్స అందించారు. నమూనాలు సేకరించి తిరుపతిలోని ల్యాబ్ కు పంపగా, రిపోర్టులో కరోనా పాజిటివ్ అని వచ్చింది. మరోసారి నిర్ధారణ చేసుకునేందుకు నమూనాలను పుణెలోని ల్యాబ్ కు పంపారు. ఆ రిపోర్టులోనూ కరోనా పాజిటివ్ అని వచ్చింది. దీంతో నెల్లూరు జనరల్ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉంచి డాక్టర్లు ట్రీట్ మెంట్ స్టార్ట్ చేశారు. 14 రోజుల పాటు చికిత్స అందించారు. ఆ తర్వాత అతడి నమూనాలు సేకరించి ల్యాబ్ కు పంపారు. అలా రెండు సార్లు ల్యాబ్ కి పంపారు. రెండు సార్లు కూడా రిపోర్టులో నెగిటివ్ అని వచ్చింది. దీంతో డాక్టర్లు ఉన్నతాధికారులకు విషయాన్ని చెప్పారు. వారి అంగీకారంతో యువకుడిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ప్రభుత్వ అంబులెన్స్ లో ఆ వ్యక్తిని ఇంటికి పంపించారు.

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య, మృతుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో అందరిలో భయం నెలకొంది. కరోనా సోకితే చనిపోవాల్సిందే అని అంతా భయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో కరోనా సోకిన బాధితుడు పూర్తిగా కోలుకోవడం ఊరటనిచ్చింది. కరోనా లక్షణాలతో దేశవ్యాప్తంగా పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో ఈ వార్త ధైర్యం నింపింది.