నెల్లూరులో వైసీపీకి బిగ్ షాక్.. మేయర్ స్రవంతి దంపతులు రాజీనామా.. ఎందుకంటే?

నెల్లూరు మేయర్ స్రవంతి మాట్లాడుతూ.. వైసీపీకి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకున్నా నాకు కార్పొరేటర్ టికెట్ ను శ్రీధర్ రెడ్డి ఇచ్చారు..

నెల్లూరులో వైసీపీకి బిగ్ షాక్.. మేయర్ స్రవంతి దంపతులు రాజీనామా.. ఎందుకంటే?

Nellore Mayor Sravanti

Updated On : June 10, 2024 / 11:39 AM IST

Nellore District YSRCP : ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం తరువాత ఆ పార్టీని వీడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా నెల్లూరు జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి, భర్త జయవర్ధన్ వైసీపీకి రాజీనామా చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంటే నడుస్తామని మేయర్ దంపతులు తెలిపారు. కొద్ది నెలల క్రితం అధికార వైసీపీ ఒత్తిడి మేరకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి దూరం కావల్సి వచ్చిందని, ప్రస్తుతం వైసీపీకి రాజీనామా చేసి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో వారు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

Also Read : మంత్రివర్గం కూర్పుపై చంద్రబాబు కసరత్తు.. ఉమ్మడి జిల్లాల వారిగా రేసులో ఉంది వీరే..

నెల్లూరు మేయర్ స్రవంతి మాట్లాడుతూ.. వైసీపీకి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకున్నా నాకు కార్పొరేటర్ టికెట్ ను శ్రీధర్ రెడ్డి ఇచ్చారు. అంతేగాక మేయర్ ను చేశారు. మాలాంటి ఎందరో కార్యకర్తలకు రాజకీయ అవకాశాలు కల్పించారని అన్నారు. రాజకీయాల్లో నాకు ధైర్యాన్ని ఇచ్చారు. శ్రీధర్ రెడ్డి వైసీపీని వీడినప్పుడు కూడా ఆయనతోనే ఉంటానని స్పష్టం చేశాం. అప్పట్లో అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో వైసీపీలోకి వెళ్లాల్సి వచ్చింది. శ్రీధర్ రెడ్డిపై విమర్శలు చేయాలని అక్కడి నాయకులు మాపై ఒత్తిడి తెచ్చారు. శ్రీధర్ రెడ్డిని ఒకమాట కూడా మాట్లాడలేదు. మా తప్పులను శ్రీధర్ రెడ్డి మన్నించి మమ్మల్ని అక్కున చేర్చుకోవాలని కోరుకుంటున్నామని స్రవంతి పేర్కొన్నారు.

Also Read : Narendra Modi : ప్రధాని మోదీకి ఏపీ మాజీ సీఎం జగన్ శుభాకాంక్షలు

నెల్లూరు ఉమ్మడి జిల్లాలో అసెంబ్లీ ఫలితాల్లో వైసీపీకి ప్రజలు ఊహించని తీర్పు ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలోని పార్లమెంట్ నియోజకవర్గంతోపాటు పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. పార్టీ అధికారం కోల్పోయిన తరువాత మేయర్ వైసీపీకి రాజీనామా చేయడం ఆ పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. వైసీపీని వీడేందుకు ఇంకెవరెవరు సిద్ధమయ్యారన్న చర్చ నెల్లూరు జిల్లా రాజకీయాల్లో సాగుతుంది.