AP Liquor : ఏపీ మందుబాబులకు గుడ్ న్యూస్, అర్ధరాత్రి వరకు వైన్స్ ఓపెన్..కిక్కేకిక్కు

ఏపీలోని ప్రధాన నగరాల్లో కూడా కొవిడ్‌ నిబంధనల మధ్యే కొత్త సంవత్సర వేడుకలు జరగనున్నాయి. విశాఖ, విజయవాడల్లో న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌పై...

AP Liquor : ఏపీ మందుబాబులకు గుడ్ న్యూస్, అర్ధరాత్రి వరకు వైన్స్ ఓపెన్..కిక్కేకిక్కు

No Drink

Updated On : December 31, 2021 / 2:00 PM IST

New Year’s Eve Liquor Sales : నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రం తీసుకున్న నిర్ణయమే తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న బార్లు, రీటైల్ మద్యం దుకాణాలు..మద్యం విక్రయాల సమయాన్ని మరో గంటపాటు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు 2021, డిసెంబర్ 31వ తేదీ శుక్రవారం ఉత్తర్వులు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ జారీ చేశారు. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలు జరుగనున్నాయి. ఈవెంట్స్ తో పాటు పర్యాటక లైసెన్సులు కలిగిన హోటళ్లలో విక్రయించుకొనేలా అనుమతి ఇచ్చింది.

Read More : Textiles: టెక్స్ టైల్స్‌‌పై జీఎస్టీ పెంపు వాయిదా

మరోవైపు…

ఏపీలోని ప్రధాన నగరాల్లో కూడా కొవిడ్‌ నిబంధనల మధ్యే కొత్త సంవత్సర వేడుకలు జరగనున్నాయి. విశాఖ, విజయవాడల్లో న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌పై ఆంక్షలు విధించారు పోలీసులు. డిసెంబర్ 31వ తేదీ శుక్రవారం రాత్రి విజయవాడలో వేడుకలకు అనుమతి లేదని కమిషనర్ క్రాంతి రాణా స్పష్టం చేశారు. అర్ధరాత్రి 12గంటల వరకు మాత్రమే ఇండోర్ వేడుకలకు అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. రోడ్లపై ఎవరూ తిరగకూడదంటూ హెచ్చరించారు. బెజవాడలో 144 సెక్షన్ అమలులో ఉందన్నారు సీపీ. న్యూ ఇయర్ వేడుకలు రోడ్లపై చేస్తే కుదరదని తెలిపారు. రోడ్లపై ఐదుగురికంటే ఎక్కువ మంది గుమికూడడంపై నిషేధం విధించారు. అలాగే క్లబ్‌లు, రెస్టారెంట్లలో 60 శాతం ఆక్యుపెన్సీతోనే వేడుకలు జరపాలని ఆదేశించారు. వీటికోసం రెస్టారెంట్లు, క్లబ్‌లు ముందుగానే పోలీసుల నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేశారు.

Read More : Movie Tickets: తెలంగాణలో సినిమాలు చూడం.. టిక్కెట్ల ధరలపై ప్రేక్షకులు ఆగ్రహం

డీజేలు, భారీ స్పీకర్లకు అనుమతి లేదు. నగర వ్యాప్తంగా 15 చోట్ల డ్రంక్​ అండ్ డ్రైవ్​ టెస్టులు నిర్వహించనున్నారు పోలీసులు. ప్రధాన రహదారులైన బందర్​ రోడ్, ఏలూరు రోడ్​, బీఆర్​టీఎస్​రోడ్లలో కఠిన ఆంక్షలు అమలులో ఉంటాయి. బెంజ్ సర్కిల్​ ఫ్లై ఓవర్, కనకదుర్గ ఫ్లై ఓవర్​, పీసీఆర్​ ఫ్లై ఓవర్‌లపై ట్రాఫిక్‌కు అనుమతి లేదు. ఇటు విశాఖ బీచ్ రోడ్డులో డిసెంబర్ 31వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి వేడుకలపై నిషేధం విధించారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్, బీ‌ఆర్‌టీ‌ఎస్ సెంటర్ లైన్ రోడ్ మూసివేయనున్నారు. నగరంలో కేక్ కటింగ్‌లు, డీజేలపై కూడా నిషేదాజ్ఞలు జారీ చేశారు.