ఏపీలో కరోనా తగ్గుముఖం : కొత్తగా 214 కేసులు, ఇద్దరు మృతి

ఏపీలో కరోనా తగ్గుముఖం : కొత్తగా 214 కేసులు, ఇద్దరు మృతి

Updated On : December 21, 2020 / 9:02 PM IST

Newly registered 214 corona cases in AP : ఏపీలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 214 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,78,937 కు చేరింది.

రాష్ట్రంలో గత 24 గంటల్లో 40,295 శాంపిల్స్ ను పరీక్షించగా 214 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా బారిన పడి గుంటూరు జిల్లాలో ఒకరు, కృష్ణా జిల్లాలో ఒకరు చొప్పున మరణించారు. ఏపీలో కరోనాతో ఇప్పటివరకు 7,078 మంది మరణించారు.

గడిచిన 24 గంటల్లో 422 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 3992కు చేరింది. నేటి వరకు రాష్ట్రంలో 1,13,01,105 శాంపిల్స్ ను పరీక్షించారు.