అనుమతి లేకుండా రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు చేపట్టడానికి వీల్లేదన్న ఎన్‌జీటి

అనుమతి లేకుండా రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు చేపట్టడానికి వీల్లేదన్న ఎన్‌జీటి

Updated On : February 16, 2021 / 4:42 PM IST

Rayalaseema excavation project : సంగమేశ్వరంలో రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై ఎన్‌జీటి చెన్నై బెంచ్‌లో విచారణ జరిగింది. అనుమతి లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడానికి వీల్లేదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. జడ్జిమెంట్ ధిక్కరించి నిర్మాణ పనులు సాగిస్తున్నారన్న పిటిషన్‌పై ఎన్‌జీటి విచారణ జరిపింది.

పర్యావరణ అనుమతులు అవసరం లేదని ఏపీ ప్రభుత్వం.. కేంద్ర పర్యావరణశాఖకు లేఖ రాసిందని పిటిషనర్‌ శ్రీనివాస్ బెంచ్‌ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఉద్దేశపూర్వకంగా ఎన్‌జీటి ఆదేశాలను ప్రభుత్వం ఉల్లంఘిస్తోందన్నారు. తాము దాఖలు చేసిన ఉల్లంఘన కేసుపై నాలుగోసారి ఏపీ ప్రభుత్వం వాయిదా కోరుతోందని ట్రిబ్యునల్ దృష్టికి తీసుకొచ్చారు.

ఇరువురి వాదనలు విన్న ఎన్‌జీటీ… రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు చేపట్టడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 24కు వాయిదా పడింది.