Chinarajappa: అదుపుతప్పి డివైడర్‌పైకి ఎక్కిన చినరాజప్ప కారు..

అదే సమయంలో రోడ్డుపై ఒక వ్యక్తి అకస్మాత్తుగా అడ్డు రావడంతో అతడిని తప్పించబోయి అదుపుతప్పిన కారు డివైడర్‌పైకి..

Chinarajappa: అదుపుతప్పి డివైడర్‌పైకి ఎక్కిన చినరాజప్ప కారు..

Nimmakayala Chinarajappa

Updated On : February 24, 2024 / 9:40 PM IST

కాకినాడ జిల్లా పెద్దాపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత చినరాజప్పకు కారు ప్రమాదం తప్పింది. టీడీపీ-జనసేన అభ్యర్థుల తొలి జాబితాను ఇవాళ విడుదల చేసిన విషయం తెలిసిందే. తొలి జాబితాలో చినరాజప్ప పేరు ఉంది. సీటు ప్రకటించడంతో జే తిమ్మాపురంలో టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి చినరాజప్ప సంబరాల్లో పాల్గొన్నారు.

టీడీపీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొని చినరాజప్ప కారులో తిరిగి వెళ్తున్నారు. అదే సమయంలో రోడ్డుపై ఒక వ్యక్తి అకస్మాత్తుగా అడ్డు రావడంతో అతడిని తప్పించబోయి అదుపుతప్పిన కారు డివైడర్‌పైకి ఎక్కింది. ప్రమాదంలో చినరాజప్పకు గాయాలు కాలేదు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఆయన కారు స్వల్పంగా డ్యామేజ్ అయింది. అదే కారులో చినరాజప్ప ఇంటికి వెళ్లారు.

ఎవరికి ఎవరు పోటీ? టీడీపీ-జనసేన కూటమి, వైసీపీ అభ్యర్థుల బలాబలాలు ఇవే..