Niti Aayog In AP : ఏపీలో నీతి అయోగ్ బృందం పర్యటన..
ఏపీలో నీతి ఆయోగ్ సభ్యుల బృందం పర్యటిస్తోంది.వీరపనేనిగూడెంలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించింది.అనంతరం సీఎం జగన్ తో సమావేశం కానుంది.

Niti Aayog In Ap
Niti Aayog Tour In AP : ఏపీలో నీతి ఆయోగ్ సభ్యుల బృందం పర్యటిస్తోంది. ఢిల్లీ నుంచి విజయవాడ విమానాశ్రానికి చేరుకున్న నీతి ఆయోగ్ సభ్యులకు ఏపీ ప్రభుత్వ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం నీతి ఆయోగ్ సభ్యుల బృందం కృష్టా జిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడెంలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించింది. ఈ సందర్భంగా సేంద్రియ వ్యవసాయ వరిపంటను పరిశీలించింది. సేంద్రీయ వ్యవసాయం గురించి దాంట్లో ఉండే పద్ధతుల గురించి రైతును అడిగి తెలుసుకుంది. వీరపనేని గూడెంలో నీతి ఆయోగ్ బృందం పర్యటన ముగించుకుని విజయవాడకు చేరుకుంది. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజీవ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.
కాగా..నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యులకు ఏపీ ప్రభుత్వ అధికారులు గన్నవరం ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికారు. ముందుగా కృష్టా జిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడెంలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించిన బృందం సీఎం వైఎస్ జగన్‌తో పాటు వివిధ శాఖల అధికారులతో నీతి ఆయోగ్ బృందం భేటీ కానుంది.