Baby Died due to Corona : విశాఖలో విషాదం.. బెడ్ దొరక్క చిన్నారి మృతి

No Beds In Visakha Kgh 2 Years Baby Died Due To Corona
Baby Died due to Corona : విశాఖ కేజీహెచ్ ఆసుపత్రి వద్ద దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆసుపత్రిలో బెడ్స్ లేక పేషంట్లు నానా పాట్లు పడుతున్నారు. కొవిడ్‌తో బాధపడుతున్న ఓ చిన్నారికి రెండు గంటలకు పైగానే అంబులెన్స్‌లోనే చికిత్స అందించినా పాప దక్కలేదు. అంబులెన్స్‌లోనే చిన్నారి కన్నుమూసింది. ఈ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అచ్చుతాపురానికి చెందిన ఏడాదిన్నర చిన్నారికి కొవిడ్ సోకింది. వెంటనే కేజీహెచ్ సీఎస్సార్ బ్లాక్ వద్దకు తీసుకువచ్చారు. అయితే బెడ్స్ ఖాళీగా లేకపోవడంతో… చిన్నారికి అంబులెన్స్‌లోనే ఉంచి వైద్యం అందించారు. చికిత్స అందిస్తుండగా అంబులెన్స్ లోనే చిన్నారి మృతి చెందడంతో కేజీహెచ్ వద్ద విషాదం చోటు చేసుకుంది.