Volunteer Jobs : భారీగా వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ఏపీలో మరోసారి భారీగా వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. కడప జిల్లాలో 913 గ్రామ, వార్డు వాలంటీర్ పోస్టుల నియామకానికి దరఖాస్తులు కోరుతున్నారు.

Volunteer Jobs : భారీగా వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Volunteer Jobs

Updated On : June 5, 2021 / 1:13 PM IST

Volunteer Jobs : ఏపీలో మరోసారి భారీగా వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. కడప జిల్లాలో 913 గ్రామ, వార్డు వాలంటీర్ పోస్టుల నియామకానికి దరఖాస్తులు కోరుతున్నారు. టెన్త్, ఇంటర్ పాసైన అభ్యర్థులు అర్హులు. స్థానిక వార్డు, గ్రామ పరిధిలో నివసిస్తున్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థుల వయస్సు 18-35 ఏళ్లు ఉండాలి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో ఆయా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. జిల్లా సెలెక్షన్‌ కమిటీ.. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జూన్‌ 6 దరఖాస్తులకు చివరి తేదీ.

పూర్తి వివరాలకు.. https://gswsvolunteer.apcfss.in/ లేదా https://apgv.apcfss.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

అర్హత: పదో తరగతి/ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి. స్థానికంగా నివాసం ఉండాలి. ప్రభుత్వ పథకాల మీద పూర్తి అవగాహన అవసరం. ప్రభుత్వం చేపడుతన్న కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై పరిజ్ఞానం ఉండాలి. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, సాఫ్ట్‌ స్కిల్స్‌ అవసరం. తెలుగు రాయడం, చదవడం తెలిసుండాలి.

వయసు: అభ్యర్థుల వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ: ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహనకు 25 మార్కులు. ప్రభుత్వ సంక్షేమ విభాగాలు, సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న అనుభవానికి 25 మార్కులు. నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌కు 25 మార్కులు. సాఫ్ట్‌ స్కిల్స్‌కు 25 మార్కులు కేటాయించారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 6, 2021

వెబ్‌సైట్ ‌: https://gswsvolunteer.apcfss.in/ లేదా https://apgv.apcfss.in/

ప్రతి గడపకు అభివృద్ధి ఫలాలు అందించే ఉద్దేశంతో సీఎం జగన్ గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. ఇందులో భాగంగా గ్రామ, వార్డు వాలంటీర్లను నియమించారు. వారి ద్వారా ప్రభుత్వ పథకాలు, సేవలు నేరుగా ప్రజలకు అందేలా చూస్తున్నారు.