Andhra Pradesh: కొత్త సబ్ డిస్ట్రిక్ట్‌ల ఏర్పాటు.. నోటిఫికేషన్ జారీ.. ఎక్కడెక్కడో తెలుసా!
భూముల రీసర్వే అనంతరం పాలన, పౌర సేవలు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మరింత వేగంగా చేపట్టేందుకు రాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.

AP CM Jagan
Andhra Pradesh – Sub Districts : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్త సబ్ డిస్ట్రిక్ట్‌లను ఏర్పాటు కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలోని అనకాపల్లి (Anakapalle), చిత్తూరు (Chittoor), కృష్ణా, మన్యం, నెల్లూరు, శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరం, కడప, కోనసీమ, ఏలూరు, కర్నూలు, తూర్పు గోదావరి జిల్లాల్లో సబ్ డిస్ట్రిక్ట్‌లను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
భూముల రీసర్వే అనంతరం పాలన, పౌర సేవలు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మరింత వేగంగా చేపట్టేందుకు రాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది. కొత్త సబ్ డిస్ట్రిక్ట్‌లను ఏర్పాటుకు నోటిఫికేషన్ వెలువడడంతో ఆయా సబ్ డిస్ట్రిక్ట్‌లలోని రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధి గురించి స్పష్టత వచ్చింది.
ఆయా కొత్త సబ్ డిస్ట్రిక్ట్‌లలో జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు సర్కారు పేర్కొంది. రిజిస్ట్రేషన్ల చట్టం 1908, సెక్షన్ 5 కింద సబ్ డిస్ట్రిక్ట్‌ల ఏర్పాటు జరిగింది. ఇకపై నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రాంతాలు అన్నీ కొత్త సబ్ డిస్ట్రిక్ట్‌ల పరిధిలో ఉంటాయి.