AP Elections 2024: టీడీపీలో హీటెక్కిస్తున్న నూజివీడు సీటు

AP Elections 2024: కార్యకర్తల సమావేశంలో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన చంద్రబాబు..

AP Elections 2024: టీడీపీలో హీటెక్కిస్తున్న నూజివీడు సీటు

TDP

Updated On : February 18, 2024 / 3:42 PM IST

టీడీపీలో నూజివీడు పంచాయితీ కొనసాగుతోంది. ఇప్పటికే నూజివీడు అభ్యర్థిగా పార్థసారథిని టీడీపీ అధిష్ఠానం దాదాపు ఖరారు చేసింది. పార్థసారథి ఈనెల 26న టీడీపీలో చేరికకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే, ఆయన చేరికను టీడీపీ నేత ముద్రబోయిన వెంకటేశ్వరరావు వ్యతిరేకిస్తున్నారు.

కార్యకర్తల అభీష్టం మేరకే నిర్ణయాలు తీసుకోవాలంటూ వాదిస్తున్నారు. కార్యకర్తల సమావేశంలో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన చంద్రబాబు నాయుడు చర్చించారు. అలాగే, ముద్రబోయిన వెంకటేశ్వరరావును ఒప్పించే బాధ్యతను యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు తీసుకున్నారు. ముద్రబోయిన మాత్రం మెత్తబడడం లేదు.

పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి ఇటీవల టీడీపీలో చేరాలని భావించగా ఆ చేరిక వాయిదా పడిన విషయం తెలిసిందే. పెనమలూరు నుంచి టికెట్ కావాలని అడిగిన పార్థసారథికి టీడీపీ నూజివీడు ఆప్షన్ ఇచ్చింది. పెనమలూరు నుంచి పార్థసారథికి టికెట్ ఇచ్చేందుకు అక్కడి టీడీపీ నేతలు కూడా ఒప్పుకోలేదు. పార్థసారథి సీటుపై టీడీపీ కొన్ని రోజులుగా ఎటూ తేల్చుకోలేకపోయింది.

చంద్రబాబూ దమ్ముంటే రా.. నీ చరిత్ర ఏంటో నా చరిత్ర ఏంటో చర్చిద్దాం : ఎమ్మెల్యే కరణం బలరాం