Pawan Kalyan : జనసేన అధికారంలోకి రాగానే దాన్ని సంపూర్ణంగా రద్దు చేస్తాము- పవన్ కల్యాణ్ హామీ
Pawan Kalyan : గొడవలు పెంచే వాడు నాయకుడు కాదు.. గొడవలు తగ్గించే వాడు నాయకుడు.

Pawan Kalyan (Photo : Twitter)
Pawan Kalyan – Amalapuram : ఏపీలో జనసేన పార్టీ అధికారంలోకి రాగానే సీపీఎస్ ను సంపూర్ణంగా రద్దు చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తా అన్న పెద్దమనిషి ఎందుకు చేయలేదు? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో పవన్ వారాహి యాత్రలో పాల్గొన్నారు. గడియార స్తంభం సెంటర్ దగ్గర నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు పవన్ కల్యాణ్.
” నిన్న కోనసీమలో అడుగు పెట్టినప్పుడు కోనసీమ వాడి వేడి తట్టుకోవడం నాకు కూడా కష్టమైంది. నేను ఓడిపోయినా రాజకీయాల్లో ఉండి పోవడానికి మీ ప్రేమ కవచంలా పని చేసింది. గత ఎన్నికల్లో 35వేల పైచిలుకు ఓట్లు ఈ ప్రాంతం నుండి వేసి నాకు అండగా నిలిచారు.
తెలంగాణ విభజన దగ్గరి నుండి ప్రతి ఒక్కరి దృష్టి ఉభయ గోదావరి జిల్లాల పైన ఉంది. మహానుభావుడు అంబేద్కర్ పేరు పెట్టడానికి ఇంత గొడవ చేశారు. కోనసీమ అల్లర్ల కేసులో 250 మంది మీద కేసులు ఎత్తేయండి. గొడవలు పెంచే వాడు నాయకుడు కాదు.. గొడవలు తగ్గించే వాడు నాయకుడు.
అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తా అన్న పెద్దమనిషి ఎందుకు చేయలేదు? జనసేన అధికారంలోకి రాగానే సీపీఎస్ ను సంపూర్ణంగా రద్దు చేస్తాము. ఇన్ని వేల కోట్ల ఆయిల్ నిక్షేపాలు ఈ ప్రాంతం నుండి వెళ్తున్నాయి. కానీ, ఈ ప్రాంతంలో సరైన ఆసుపత్రులు లేవు” అని పవన్ కల్యాణ్ వాపోయారు.