ఆంధ్రప్రదేశ్‌లో తొలి కరోనా మరణం

  • Published By: vamsi ,Published On : April 3, 2020 / 04:06 AM IST
ఆంధ్రప్రదేశ్‌లో తొలి కరోనా మరణం

Updated On : April 3, 2020 / 4:06 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి వేగంగా పెరుగుతున్నాయి. మర్కజ్ ప్రార్ధనలలో పాల్గొన్న వారి కారణంగా కరోనా కేసుల సంఖ్య రెండు రోజుల్లోనే పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 149 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒకే రోజు 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం అధికార వర్గాల్లో కూడా కలవరం పెడుతుంది.

ఇదిలా ఉంటే ఆంధప్రదేశ్‌లో తొలి కరోనా మరణం నమోదైంది. విజయవాడలోని భవానీపురంలో ఒకే కుటుంబంలో ఐదుగురికి పాజిటివ్ రావడం కలకలం రేపగా.. తొలి కరోనా మరణం కూడా అక్కడే సంభవించింది. విజయవాడకు చెందిన ఓ వ్యక్తి ఢిల్లీ జమాతే సభకు వెళ్లి రాగా.. ఆ వ్యక్తి తండ్రి కరోనాతో చనిపోయాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు నూజివీడు, జగ్గయ్యపేటలను రెడ్ జోన్లగా నిర్ణయించారు. ఇక, భవానీపురం, ఆటోనగర్, పాత రాజరాజేశ్వరిపేటలో పకడ్బందీగా కర్ఫ్యూ విధించారు. 

సోమవారం(06 ఏప్రిల్ 2020) రాత్రి 10 గంటల వరకు రాష్ట్రంలో కేవలం 43 కేసులే నమోదవగా, ఆ తర్వాత మూడు రోజుల్లో అదనంగా 106 కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 24 కేసులు, తర్వాత కృష్ణాలో 23, గుంటూరు జిల్లాలో 20 కేసులు ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మాత్రమే ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

Also Read | మోడీ మరో పిలుపు : ఏప్రిల్ 5న 9 గంటలకు 9 నిమిషాల పాటు కొవ్వొత్తులు, దీపాలు వెలిగించండి