Pawan Kalyan: 14 ఏళ్ల నా అరణ్యవాసం పూర్తయింది.. ఇక నేను చేసేదంతా.. : పవన్ కల్యాణ్

తప్పు చేసిన వాడు రెడ్డి, కమ్మ, కాపు, బీసీ, దళిత ఏ సామాజిక వర్గమైనా సరే అందరూ ఖండించాలని చెప్పారు.

Pawan Kalyan: 14 ఏళ్ల నా అరణ్యవాసం పూర్తయింది.. ఇక నేను చేసేదంతా.. : పవన్ కల్యాణ్

Pawan Kalyan

Updated On : June 23, 2023 / 6:26 PM IST

Pawan Kalyan – JanaSena: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కోనసీమ జిల్లా ( Konaseema district) అమలాపురంలో తమ పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ(YCP)పై పోరాటం చేయడంపై దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తాను రాజకీయాల్లోకి వచ్చి దాదాపు 14 ఏళ్లు అవుతుందని, ఇక అరణ్యవాసం ముగిసిందని, యుద్ధం చేద్దామని అన్నారు. తప్పు చేసిన వాడు రెడ్డి, కమ్మ, కాపు, బీసీ, దళిత ఏ సామాజిక వర్గమైనా సరే అందరూ ఖండించాలని చెప్పారు.

బాపట్లలో ఓ గౌడ కులస్థుడైన బాలుడిని వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తి తగలబెట్టి చంపేస్తే అది రెడ్డి కులం వారికి ఆపాదించకూడదని అన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఓ దళిత డ్రైవర్ ను చంపేస్తే, నిందితుడు కాపు కులస్థుడైనంత మాత్రాన తానేం సమర్దించలేదని తెలిపారు.

తప్పు చేసిన వాడు ఏ కులమైనా సరే శిక్ష పడాల్సిందేనని చెప్పారు. కోపాలు అందరికీ ఉంటాయని, తనకు కూడా కోపం ఉందని అన్నారు. అయితే, ఆ కోపాన్ని వివేకంగా ప్రదర్శించకపోతే అర్థం ఉండదని చెప్పారు. జన సైనికులు వివాదాల జోలికి వెళ్లకూడదని అన్నారు. ఎంత బలమైన ఉద్యమమైనా హింస ఉంటే ఆ ఉద్యమం వెనక్కు వెళ్లిపోతుందని అన్నారు.

అమలాపురంలో త్వరలో ఆఫీస్ పెడతానని తెలిపారు. మనలోని కోపాన్ని మనలో మనం కొట్టుకోవడానికి కాకుండా మనల్ని దోపిడీ చేసే వ్యక్తులపై చూపిద్దామని చెప్పారు. జనసేన ప్రభుత్వం ఏర్పడితే ప్రజల ఆరోగ్యానికి, రైతుల కష్టానికి భరోసా ఇస్తామని తెలిపారు. జనసేన ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పారు.

Revanth Reddy : అధికారంలోకి రాగానే.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ఇస్తాం- రేవంత్ రెడ్డి