151 మంది ఎమ్మెల్యేలున్న పార్టీ.. ఒక్క ఎమ్మెల్యే ఉన్న పార్టీకి భయపడుతుంది
జనసేనాని పవన్ కళ్యాణ్ వైసీపీపై మండిపడ్డారు. 151 మంది ఎమ్మెల్యేలున్న పార్టీ ఒక ఎమ్మెల్యే ఉన్న పార్టీకి భయపడుతోందంటే.. ఎవరు ఎవరికి భయపడుతున్నారని ప్రశ్నించారు.

జనసేనాని పవన్ కళ్యాణ్ వైసీపీపై మండిపడ్డారు. 151 మంది ఎమ్మెల్యేలున్న పార్టీ ఒక ఎమ్మెల్యే ఉన్న పార్టీకి భయపడుతోందంటే.. ఎవరు ఎవరికి భయపడుతున్నారని ప్రశ్నించారు.
జనసేనాని పవన్ కళ్యాణ్ వైసీపీపై మండిపడ్డారు. 151 మంది ఎమ్మెల్యేలున్న పార్టీ ఒక ఎమ్మెల్యే ఉన్న పార్టీకి భయపడుతోందంటే.. ఎవరు ఎవరికి భయపడుతున్నారని ప్రశ్నించారు. గాజువాక పర్యటనలో భాగంగా పవన్ మంగళవారం (నవంబర్ 5, 2019) జనసేన శ్రేణులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెన్నుపోటు పొడిపించుకోవడానికి లేమని స్పష్టం చేశారు. దెబ్బతిన్నా తిరిగి లేస్తామని చెప్పారు.
భగవంతుడుడి ప్రేమకు, అనంత విశ్వాసానికి తాను ఎప్పుడూ మోకరిల్లుతానని చెప్పారు. ఇంతమంది రావడానికి కారణం ప్రేమ అనే భావన అని అన్నారు. మీ ఆదరణ, మీ ప్రేమ వల్ల లక్షన్నర మంది వచ్చారని తెలిపారు. తనను నమ్మే కార్యకర్తలు 200 మంది ఉంటే ఒకటిన్నర లక్షల మంది కదులుతారని అన్నారు.
పార్టీ నిర్మాణం అనేది చాలా కష్టమైందన్నారు. కుటుంబాన్ని నడపటం కుటుంబ పెద్దకు ఎంత కష్టమో… పార్టీకి నాయకత్వం వహించే వ్యక్తులకు ఆ పార్టీని నడపటం కూడా అంతే కష్టమన్నారు.